Wednesday, May 1, 2024

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ట్రాఫిక్ మళ్లింపు

- Advertisement -
- Advertisement -

Traffic diversion at counting centres in Hyderabad

ఉత్తర్వులు జారీ చేసిన ట్రాఫిక్ సిపి అనిల్

హైదరాబాద్: జిహెచ్‌ఎంసి ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అనిల్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన నగరంలోని 14 కేంద్రాల్లో జిహెచ్‌ఎంసి ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. ఆ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే ఓట్ల లెక్కింపుకు వచ్చే వారు వాహనాలను నిలిపేందుకు ప్రాంతాలను కేటాయించారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.

కార్వాన్ డివిజన్ ఓట్లను ఎల్‌బి స్టేడియం, బాక్సింగ్ హాల్, జిమ్నాజియంలో లెక్కించనున్నారు. ఇక్కడికి వచ్చే వారు తమ వాహనాలను నిజాం కాలేజీ, మహబూబియా కాలేజీ, ఆలియా కాలేజి, పబ్లిక్ గార్డెన్, టెన్నిస్ కోర్టులో పార్కింగ్ చేయాలి.
గోషామహల్ డివిజన్ ఓట్లను నిజాం కాలేజీ ఓపెన్ గ్రౌండ్‌లో లెక్కించనున్నారు, ఇక్కడికి వచ్చే వారు వాహనాలను ఎవి కాలేజీ, పిఈటి కాలేజి గ్రౌండ్, ఎన్టీఆర్ స్టేడియంలో నిలుపాలి. ముషీరాబాద్ డివిజన్ ఓట్లను కెవి రంగారెడ్డి లా కాలేజీ, ఎవి పిజీ కాలేజీ, దోమలగూడలో లెక్కించనున్నారు. వాహనాలను ఎవి కాలేజీ గ్రౌండ్ అండ్ స్కౌట్స్ అండ్ గైడ్ గ్రౌండ్‌లో నిలుపాలి.
సంతోష నగర్ డివిజన్ ఓట్లను మహవీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బండ్లగూడలో లెక్కించనున్నారు. ఇక్కడికి వచ్చేవారు మహవీర్ ఇంజనీరింగ్ కాలేజీలో వాహనాలను నలుపాలి. చాంద్రాయణగుట్ట డివిజన్ ఓట్లను అరోరా లీగల్ సర్వీసెస్ అకాడమీ, బండ్లగూడలో లెక్కించనున్నారు. వాహనాలను కాలేజీ గ్రౌండ్‌లో నిలుపాలి.  చార్మినార్ డివిజన్ ఓట్లను ప్రభుత్వ సిటీ కాలేజీలో లెక్కిస్తారు, వాహనాలను కులీకుతుబ్ షా స్టేడియంలో నిలుపాలి.

మలక్‌పేట డివిజన్ ఓట్లను అంబర్‌పేట్ మున్సిపల్ ఇండోర్ స్టేడియం, అంబర్‌పేటలో లెక్కించనున్నారు. వాహనాలను జిహెచ్‌ఎంసి గ్రౌండ్ అంబర్‌పేట, ఎంసిహెచ్ కాలనీ గ్రౌండ్‌లో నిలుపాలి. అంబర్‌పేట డివిజన్ ఓట్లను ప్రొఫెసర్ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో లెక్కిస్తారు. వాహనాలను సైక్లింగ్ స్టేడియంలో నిలుపాలి. సికింద్రాబాద్ డివిజన్ ఓట్లను ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో లెక్కిస్తారు, వాహనాలను పక్కన నిలుపాలి.  ఫలక్‌నూమా డివిజన్ ఓట్లను కమలానెహ్రూ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో లెక్కిస్తారు, వాహనాలను అక్కడే పార్కింగ్ చేయాలి. మెహిదీపట్నం డివిజన్ ఓట్లను ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ మాసబ్ ట్యాంక్ లో లెక్కిస్తారు, వాహనాలను అక్కడి గ్రౌండ్, హాకీ గ్రౌండ్‌లో నిలుపాలి. జూబ్లీహిల్స్ డివిజన్ ఓట్లను సుల్తాన్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ కాంపస్, బంజారాహిల్స్‌లో లెక్కిస్తారు, వాహనాలను అక్కడే పార్కింగ్ చేయాలి. యూసుఫ్‌గూడ డివిజన్ ఓట్లను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో నిర్వహిస్తారు, వాహనాలను అక్కడి గ్రౌండ్‌లో పార్కింగ్ చేయాలి.  బేగంపేట డివిజన్ ఓట్లను వెస్లీ డిగ్రీ కాలేజీ, బేగంపేటలో లెక్కిస్తారు. వాహనాలను కాలేజీ గ్రౌండ్‌లో నిలుపాలి.

Traffic diversion at counting centres in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News