Tuesday, April 30, 2024

ఉద్యమం వినా మరో మార్గం లేదు

- Advertisement -
- Advertisement -

బడి బాగోలేదని గగ్గోలు పెడతాం, పిల్లలకు సరైన మెంటారింగ్ ఎప్పుడో? అని చింతిస్తుంటాం, పంతుళ్లకు నిజమైన ఓరియేంటేషన్ కావాలని వాదిస్తుంటాం, యాజమాన్యాలకు వసూళ్ల మీద తప్ప సేవల నాణ్యతపై ధ్యాసెక్కడిది? అని తల బాదుకుంటుంటాం. డిగ్రీలంటే అచ్చొత్తిన కాగితాలేనా? వ్యక్తికి సరిపడా ఉత్పాదకతా నైపుణ్యాలేవీ? చూస్తుండగానే ఓ తరం వచ్చేస్తుంది, ఏ పనీరాని సోలో జనరేషన్ ఒక వైపు, అన్నీ ఉండి అవకాశాలకు దూరంగా విసిరేయబడ్డ మూర్తిమంతులు ఇంకో వైపు ఏమిటీ విపత్కరం? పట్టించుకునే నాథుడేడీ! ఇదీ ఇవాళ్టి అక్షర ఘోష. అయితే, క్లిష్ట సమయంలో మానవాళికి దాపురించిన ముప్పును గురించి మాట్లాడాల్సిన వాళ్లు తప్పక మాట్లాడే తీరుతారు.

An essay on Ambedkar biography

‘My final takeaway, is that all of this deep, transformative change simply will not happen without a movement for transformation. If the global public, students, teachers, parents, civil society, business and others do not demand this change, if they do not mobilize for concrete action, then Governments are unlikely to give this the priority it deserves’ General Amina Mohammed ( UN Deputy Secretary)

బడి బాగోలేదని గగ్గోలు పెడతాం, పిల్లలకు సరైన మెంటారింగ్ ఎప్పుడో? అని చింతిస్తుంటాం, పంతుళ్లకు నిజమైన ఓరియేంటేషన్ కావాలని వాదిస్తుంటాం, యాజమాన్యాలకు వసూళ్ల మీద తప్ప సేవల నాణ్యతపై ధ్యాసెక్కడిది? అని తల బాదుకుంటుంటాం. డిగ్రీలంటే అచ్చొత్తిన కాగితాలేనా? వ్యక్తికి సరిపడా ఉత్పాదకతా నైపుణ్యాలేవీ? చూస్తుండగానే ఓ తరం వచ్చేస్తుంది, ఏ పనీరాని సోలో జనరేషన్ ఒక వైపు, అన్నీ ఉండి అవకాశాలకు దూరంగా విసిరేయబడ్డ మూర్తిమంతులు ఇంకో వైపు ఏమిటీ విపత్కరం? పట్టించుకునే నాథుడేడీ! ఇదీ ఇవాళ్టి అక్షర ఘోష. అయితే, క్లిష్ట సమయంలో మానవాళికి దాపురించిన ముప్పును గురించి మాట్లాడాల్సిన వాళ్లు తప్పక మాట్లాడే తీరుతారు. ఎంతగా అంటే ఆయా దేశాల్లో నిషేధిత సంస్థలు సైతం మాట్లాడేంత తీవ్రమైన మాటలకంటే కర్కశంగా విప్లవకరంగా మాట్లాడతారు. ఆ మాటలు మనం సరిగ్గా వినం కానీ, చెవికెక్కించుకుంటే వ్యవస్థల్లో పెద్ద తిరుగుబాటే వచ్చి తీరుతుంది. మొన్న జూన్ 28, 29, 30 తేదీల్లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ‘What and How’ of Learning Will Help Repur posed Education for All’ అనే అంశంపై పారిస్ నగరంలో మూడు రోజుల ప్రీ-సమ్మిట్ జరిగింది. ఈ కూటమిలో ముగింపు ప్రసంగం చేస్తూ విశ్వవ్యాప్తంగా విద్యా విధానంలో తక్షణం తీసుకు రావాల్సిన మార్పును గురించి ఐక్యరాజ్య సమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మొహమ్మద్ ఆయా దేశాల ప్రభుత్వాలపై ఘాటుగా స్పందించాడు. ప్రభుత్వాలు కనీసం ఇప్పటికైనా ప్రజోపయోగ విద్యకై యోచన చేస్తాయేమో చూద్దాం.

పారిస్ ప్రీ సమ్మిట్‌లో ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వీళ్లలో ఇద్దరు దేశాధ్యక్షులు, నూటా యాభై నాలుగు మంది మంత్రులు, ఉపమంత్రులు, రెండు వందల మంది విద్యాధికులైన యువతీ యువకులు, ఆ పైన పరిశోధకులు, యాజమాన్యాలు, పేరెంట్స్, కన్సల్టెన్సీలు పాల్గొన్నారు. విద్యలో ‘ఏం మార్పు కావాలి, ఎట్లా?’ అనే సీరియస్ చర్చ ఆ మూడు రోజులు నడచింది. అనేక ప్రతిపాదనలు తీర్మానాలు, వచ్చే సెప్టెంబరు నెలలలో జరిగే విద్యా శిగరాగ్ర సమావేశాల్లో ఏయే నిర్ణయాలు తీసుకోవాలో చర్చించారు.

ముఖ్యంగా అభ్యాస వాతావరణమే ఎప్పుడైనా ఎక్కడైనా విద్యార్థికి కీలకమైందని, జీవితంలో ఎవరైనా అభివృద్ధి చెందడానికి వీలు కల్పించేది కూడా అభ్యాస వాతావరణమేనని, విద్యకు సంబంధించి ఇది వరకు అనేక పర్యాయాలు అనుకొని విస్మరించబడిన ప్రాధాన్యతలపై నిశిత దృష్టి అవసరమని, వైకల్యాలున్న వ్యక్తులు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలు, పేదరికం నుండి వచ్చిన వెనుకబడిన వర్గాలు, వివిధ కారణాల రీత్యా స్వస్థలాల నుంచి స్థానభ్రంశం చెందినవాళ్లు, ఇతరేతర కారణాల వల్ల విద్యకు దూరమైన వారినందరినీ కలుపుకోకుండా ‘గ్లోబల్ ఫ్యామిలీ’ దృక్పథం ముందుబడదని, సహస్రాబ్ది లక్ష్యాలు- 2030 ను చేరుకోవడం సాధ్యం కాదని, విద్యలో ముందడుగు గురించి అనేక నిర్దేశాలను సభ ఆమోదించింది. అభ్యాసకుల భద్రత, అందరికీ నేర్చుకునే ప్రాప్యతను నిర్ధారించడానికి ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలు, రాజకీయ హింస, ఉగ్రవాదం, వ్యవస్థాగత వివక్షను అంతం చేయడమే ఏకైక గొప్ప చర్య అని సదస్సు అభిప్రాయపడింది. ఒక రకంగా ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధ బీభత్సంపై పరోక్ష వ్యాఖ్య. అఫ్ఘానిస్తాన్‌లో ఇప్పటికీ బాలికల విద్యపై కొనసాగుతున్న వివక్షను అక్కడి పౌర జీవన పరిస్థితులపై సదస్సు తన తీవ్రస్వరాన్ని ప్రకటించింది.

మానవాళి ఎదుర్కొనే సామాజిక ఆటంకాలు కావచ్చు, భౌగోళిక విషమ పరిస్థితులు కావచ్చు పరిష్కరింపబడాలంటే నవీన విద్యా రూపకల్పన అనివార్యమని మేధో మథనం జరిగింది. ఈ మేధో మథనంలో నాలుగు ప్రాధాన్యతలను వక్తలందరూ ప్రస్తావించారు.

అవి 1. పునాది అభ్యససం (foundational learning), 2. సమాజంతో కలసి జీవించే నైపుణ్యాలు (skills for life and living together), 3. మారుతున్న ప్రపంచంలో పని నైపుణ్యాలు (skills for a changing world of work), 4. సుస్థిరా భివృద్ధి కోసం విద్య (education for sustainable development). ఈ నాలుగు ప్రాధాన్యతలతో విద్యావిధానం రూపకల్పన జరిగినప్పటికీ టీచింగ్ వర్క్ ఫోర్స్ పరివర్తన చెందాల్సిన అవసరాన్ని సదస్సు ప్రస్తావించింది. ‘It is clear that we need to empower the teaching workforce with the capacities and tools they need to help us transform. We need to rethink the professional compe tencies of transformative teachers. And we need to invest in the education workforce to make this happen, including through possible spending benchmarks on teachers. But, while we need to build this enabling environment, we teachers, and in particular, their unions to embrace this journey with an open mind’ అంటూ బోధనా పని సమూహాలను గురించి అభిప్రాయపడింది. ఉపాధ్యాయుల కార్య మగ్నత కొరవడితే మాత్రం మళ్లీ కథ మొదటికేననీ వ్యాఖ్యానించింది. చట్టపరంగా విద్యావిధానం ఎంత అధునాతనంగా ఉన్నా, నిధుల కేటాయింపు కనుక జరగకపోతే అనుకున్న లక్ష్యాలను చేరుకోలేమని ఆర్థిక విషయాలనూ వక్తలు తమ ప్రసంగాల్లో స్పష్టం చేశారు. పేద దేశాలకు ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ పెద్ద ఎత్తున జరగాలన్నారు.

డిజిటల్ లెర్నింగ్ పరంగా కూడా పారిస్ సదస్సు కీలకమైన ఈ ఐదు అంశాలను ’ విస్తృత స్థాయి సార్వత్రిక కనెక్టివిటీని పెంచడం తద్వారా డిజిటల్ భౌతిక విభజనను పూర్తిగా నివారించడం; ఏ పాఠశాలనైనా విద్యార్థి చేరికకు ఎంచుకునేలా సిద్ధం చేయడం; ప్రాంతీయ జాతీయ గ్లోబల్ పబ్లిక్ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫారమ్‌లను అభివృద్ధి చేయడం, డిజిటల్ కామన్స్‌లో భాగంగా ఓపెన్ పబ్లిక్ డిజిటల్ లెర్నింగ్ వనరుల కోసం డ్రైవ్‌ను ప్రారంభించడం; వ్యక్తిగతంగా నేర్చుకోవడం కోసమై సంభావ్యతను పెంచడానికి డిజిటలైజేషన్‌ను శక్తివంతంగా సముద్ధరించడం; ప్రజాస్యామ్యయుత డిజిటల్ పరివర్తన — భాగస్వామ్య నిర్వహణను, భద్రత- గోప్యతను దృష్టిలో ఉంచుకొని విద్యాహక్కు పరిరక్షణకు నిబద్ధతతో సాంకేతిక వనరులను అభివృద్ధి పరచడం’ గురించి పూర్తిస్థాయిలో ఆయా సమారోహాలు వితర్కించాయి. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ దేశాలు ఇప్పుడు విద్యలో ఏ పరివర్తన కోసం తపిస్తున్నాయో వాటిపై ఈ మేధో చర్చలు ప్రధానంగా దృష్టిని సారించాయి.

నవీన విద్య కోసం పునః ప్రయోజక విద్య కోసం జరిగే ఆయా స్థాయిల సంప్రదింపుల్లో ప్రపంచం నలుమూలల నుంచి యువత, విద్యార్థులు, పౌర సమాజం, ఉపాధ్యాయులు, కన్సల్టెన్సీలు, తల్లిదండ్రులు, చింతనాపరులు భాగస్వామ్యం తీసుకోవాల్సి ఉందనేది సదస్సుల సారాంశం. ఇదే సమయంలో ఈ శ్రేణులందరికీ ఒక ఎరుక ఉండాలి. ఏమిటా ఎరుక అంటే- యావత్ ప్రపంచంలో పిల్లలూ, తల్లిదండ్రులూ విద్యను జీవితానికి అత్యున్నతమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. సమగ్ర నైపుణ్యాలు,యోగ్యమైన పారితోషికంతో కూడిన ఉపాధి, వసుధైక సంబంధాల్లో ఇమిడిపో గల చదువులే అందుబాటులోకి రావాలి. అయితే ఇది అంత ఆషామాషీ కాదు. ఈ ఊదాత్త లక్ష్యానికి చేరువయ్యే క్రమంలో వ్యవస్థీకృత వికృతమేదో మోకాలడ్డుతుంది.

కల నీరుగారిపోతుంది. శక్తివంతులు సైతం నిర్వీర్యం కాబడతారు. ఏం చేయాలో తోచదు. అందుకే పైన ఉటంకించిన యుఎన్ డిప్యూటీ సెక్రటరీ మాటల్ని మళ్లీ ఒకసారి మీతో మనవి చేస్తున్నాను. ‘విద్యలో మనం ఆశిస్తున్న లోతైన రూపాంతర గతమైన మార్పు, పరివర్తనలో భాగం అనుకుంటున్న మార్పు ఉద్యమం లేకుండా రాదు. ప్రపంచ ప్రజానీకం, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పౌర సమాజం, కన్సల్టెన్సీలు, ఇతరులు ఈ మార్పు ను డిమాండ్ చేయకపోతే, ఖచ్చితమైన ఒక విధాన పరమైన నిర్ణయం కోసం కొట్లాడకపోతే, ప్రభుత్వాలు విద్యా పునర్వ్యవస్థీకరణకు తగిన ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశమే లేదు’ అంటే మిగతా సామాజిక సమస్యల మీద ఉద్యమించినట్టే అందరినీ కలుపుకొని నవీన విద్యకోసం, పునః ప్రయోజక విద్య కోసం కోసం అందరూ సామూహికంగా పటిష్ఠ ప్రజోద్యమం నిర్మించడం వినా మరో మార్గం లేదని ఐరాస పెద్ద కూడా రగుల్ జెండా ఊపాడు. ఇక చేతనా వీచిక మన చేతల్లోనే.

డా. బెల్లియాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News