Wednesday, May 1, 2024

కానిస్టేబుల్ చైన్ కొట్టేసిన హిజ్రా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Transgender arrested for chain snatching

హైదరాబాద్: బైక్‌పై లిఫ్ట్ అడిగి కానిస్టేబుల్ చైన్‌ను కొట్టేసిన హిజ్రాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 40 గ్రాముల బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….కర్నాటక రాష్ట్రం, బెంగళూరు సిటి, బానశంకరికి చెందిన అంజుం ట్రాన్స్‌జెండర్, బసవరాజ్ వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరికి బెంగళూరులో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి చనువుగా ఉంటున్నారు. తరచూ నగరానికి వచ్చి చోరీలు చేస్తున్నారు. హిజ్రా అజుం చైన్ స్నాచింగ్ చేస్తుండగా బసవరాజ్ డిస్‌పోజ్ చేస్తున్నాడు. అజుం తరచూ నగరానికి వచ్చి ట్రాన్స్‌జెండర్లతో ఐదురోజులు ఉండి తిరిగి వెళ్లేది. ఇద్దరికి పరిచయం ఏర్పడిన తర్వాత తరచూ ఇద్దరు కలిసి నగరానికి వచ్చేవారు. సులభంగా డబ్బులు సంపాదించి, విలాసంగా బతుకాలని ఇద్దరు కలిసి ప్లాన్ వేశారు. దీనికి అంజు లిఫ్ట్ పేరుతో వాహనాల్లోకి ఎక్కి వారితో చనువుగా ఉన్నట్లు నటించేది.

హిజ్రా వలకు చిక్కిన వారి బంగారు ఆభరణాలు చోరీ చేసేది. ఎవరైనా దూరంగా పెడితే వారి మెడలోని బంగారు చైన్‌ను లాక్కుని పారిపోయేది. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి ఈ నెల 12వ తేదీన నగరానికి ఫ్లైట్‌లో వచ్చి సికింద్రాబాద్‌లోని వినాయక లాడ్జిలో ఉన్నారు. అదేరోజు రాత్రి అంజుం అనంద్ భవన్ వద్దకు చేరుకుంది. అటువైపు కారులో వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ ఇవ్వామని అడిగింది. కారులోకి వెళ్లిన తర్వాత కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారు యజమాని మెడలోని బంగారు చైన్‌ను లాక్కుని పారిపోయింది. బాధితుడు మహాకాంళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అక్కడి నుంచి పారిపోయిన అంజుం పంజాగుట్ట రోడ్డు వైపు నిల్చుంది. అటునుంచి వస్తున్న కానిస్టేబుల్‌ను లిఫ్ట్ అడిగింది. బైక్‌పైకి ఎక్కిన తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చిన తర్వాత మెడలోని బంగారు చైన్‌ను లాక్కుని పారిపోయింది. వెంటనే కానిస్టేబుల్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో నిందితులను గుర్తించిన పోలీసులు ట్రాన్స్‌జండర్, మరో వ్యక్తి అనుమానస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. వెంటనే లాడ్జికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు శ్రీకాంత్, పరమేశ్వర్, అశోక్ రెడ్డి, శివానందం తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News