Wednesday, May 1, 2024

ఆదివాసీ పథకాలు అద్భుతం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆదివాసీల కోసం తెలంగాణలో అమలవుతున్న పథకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్ర శంసించారు. గురువారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివాసీలు, బలహీన గిరిజన సమూహాలు, పివిటిజిల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీ సుకుంటున్న చర్యలపై ద్రౌపది ముర్ము సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్ర భుత్వాన్ని అభినందిస్తూ, అభివృద్ధి, సం క్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల కోసం, ప్రత్యేకించి పివిటిజిల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రపతికి వివరించారు.

గిరిజనులు, ఆదివాసీల కో సం ప్రతి ఏడాది రైతుబంధు ద్వారా ఎనిమిదిన్నర లక్షల మందికి ఇప్పటి వరకు రూ. 7,349 కోట్లు అందించినట్లు చెప్పా రు. గిరిజన ఆదివాసులకు మిషన్ భగీర థ ద్వారా తాగునీరు అందుతోందని, ఆ రోగ్య వంతుల కోసం 437 ఉప కేంద్రా లు, 32 బర్త్ వెయిటింగ్ రూంలు, ఏడు డయాగ్నాస్టిక్ హాబ్‌లను నిర్మించినట్లు తె లిపారు. అదిమ గిరిజన ప్రాంతాల్లో 31 బొశాలలు, బొశాలలు, యవిద్య, ఫైన్‌ఆర్ట్స్ కోసం ప్రత్యేక కాలేజీలు ఏర్పాటుతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలు నిర్వహిస్తున్న ట్లు రాష్ట్రపతికి వివరించారు. ఇప్పటి వర కు 918 మంది గిరిజన విద్యార్థులు ఉన్న త విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందినట్లు తెలిపారు. సిఎం ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పథకం కింద 205 మంది యువతకు ఎనిమిది విభాగాల్లో సహకారం అందించినట్లు క్రిస్టినా వెల్లడించారు.

అం దులో ఐదుగురు ఆదిమ గిరిజన తెగలకు చెందిన వారు ఉ న్నారని పేర్కొన్నారు. లక్షా 40 వేల మంది గిరిజన యువతులకు కళ్యాణలక్ష్మి పథకం కింద రూ.1,126 కోట్ల ఆర్థిక సా యం అందించినట్లు ప్రకటించారు. అటవీ ఉత్పత్తులను ప్రో త్సహిస్తూ చెంచు కోలములు, కొండరెడ్డి తెగలకు ప్రభుత్వ సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. 440 ఆదిమజాతి గిరిజన గ్రామాలలో రూ.60 కోట్లతో అంతర్గత రహదార్లు, 53 ఆదిమ జాతి ఆవాసాలలో రూ.2.39 కోట్లతో సౌర విద్యుదీకరణ చేపట్టి 443 కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు పేర్కొన్నారు. 3467 గిరిజన గ్రామాలకు రూ.221 కోట్ల వ్యయంతో త్రీఫేజ్ విద్యుదీకరణ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.3275 కోట్ల ఖర్చుతో గిరిజన ప్రాంతాల్లో 5,162 కిలోమీటర్ల మేర రహదార్లు నిర్మించినట్లు తెలిపారు.
మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు
మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని, శాస్త్ర సాంకేతిక రంగంలో మరింత ముందంజ వేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో మహిళలు సత్తా చాటుతున్నందుకు గర్వంగా ఉందన్నారు. గురువారం హైదరాబాద్‌లోని జి. నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థలో జరిగిన విద్యార్థులతో ముఖా ముఖి కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొని మాట్లాడారు.. ఆడపిల్లలు తమ కాళ్ళమీద తాము నిలబడటానికి ప్రయత్నించడం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రస్తుత విద్యా విధానంలోని అభ్యాసన సామర్ధాలు విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. టెక్నాలజీ అనేది అన్ని రంగాల్లో కీలకమైనదని, ఇన్నోవేటివ్ టెక్నాలజీపై దృష్టి సారించాలన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి భారత్‌కు ఉందని, మీరు చేసే ఇన్మోవేటివ్స్ ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలన్నారు.

ఆ దిశగా రిసెర్చ్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను మరింత ప్రోత్సహించాల్సివుందని తెలిపారు. అన్ని రంగాల్లో ఇంజనీరింగ్ పాత్ర ఎక్కుగా కనిపిస్తుందన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందడంలో ఇంజనీర్లదే కీలకపాత్రఅని, అందులో 50 శాతంపైగా మహిళలే ఉన్నారని కొనియాడారు. టెలికాం, ఐటీ, డిజైనింగ్, ఏవియేషన్ వంటి రంగాల్లో మహిళలు ప్రతిభావంతులుగా రాణిస్తున్నారని చెప్పారు. తాను అనేక యూనివర్సిటీల స్నాతకోత్సవాలకు వెళ్ళానని, అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా బంగారు పతకాలను సాధిస్తున్నారని తెలిపారు. బాలికలు, అమ్మాయిల పట్ల తల్లిదండ్రులు బేధభావం చూపకుండా వారికి అండగా నిలవాలన్నారు. చదువుతో పాటు సంస్కృతి, సంస్కారాలను అలవార్చుకోవాలని ఆమె సూచించారు. మహిళలు ఉద్యోగస్థులుగా రాణించడమే కాకుండా మరింత మందికి ఉపాధి కల్పించే దిశగా ఎదగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై సౌందర రాజన్, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News