Saturday, April 27, 2024

నడి రోడ్డులో అక్కచెల్లెళ్లపై అమానుషం

- Advertisement -
- Advertisement -

Trinamool candidate

 

సిలిగురి (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ దక్షిణ దినాజ్ పూర్ జిల్లా ఫటానగర్ గ్రామంలో శుక్రవారం ఇద్దరు అక్కాచెల్లెళ్లను కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి ఈడ్చివేసిన అమానుష సంఘటన సంచలనం కలిగించింది. తమకు చెందిన భూమిలో పంచాయతీ నాయకులు రోడ్డు నిర్మాణం తలపెట్టడంతో అక్కాచెల్లెళ్లు అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన పంచాయతీ నాయకుడు అమల్ సర్కార్ అతని అనుచరులు ఈ దారుణానికి పాల్పడ్డారు. నిందితుడు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వాడు. అక్కచెల్లెళ్లు స్మృతి కనా దాస్, సోమాదాస్ తమ తల్లితో ఫటానగర్‌లో ఉంటున్నారు. వీరిలో స్మృతి దాస్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. గతంలో పంచాయతీ రోడ్డు నిర్మాణం కోసం తమ స్థలంలో కొంత వీరు అప్పగించారు. అయితే ఆ రోడ్డును విస్తరించడానికి మరికొంత స్థలం కావాలని పంచాయతీ నాయకులు ప్రయత్నించడంతో వీరు అడ్డుకున్నారు.

అయినా జెసిబితో సహా ఇంటికి చేరుకుని రోడ్డు నిర్మాణానికి సిద్ధమయ్యారు. దీన్ని అడ్డుకున్న ఇద్దరు అక్కచెల్లెళ్లను వీరు కొట్టి తాళ్లతో కాళ్లను కట్టి కొంతదూరం ఈడ్చుకు వెళ్లడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పంచాయతీ నాయకుడు అమల్ సర్కార్‌ను పార్టీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. ఆదివారం స్మృతి దాస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమల్ సర్కార్ అతని అనుచరులు నలుగురు తమను ఇనుప రాడ్‌తో కొట్టారని, తాము సొమ్మసిల్లి కూలిపోగా, తమ కాళ్లకు తాళ్లు కట్టి 30 అడుగుల దూరం ఈడ్చుకు పోయారని ఫిర్యాదులో పేర్కొంది. సోమా దాస్ మొబైల్ ఫోను, బంగారం గొలుసు కూడా నిందితులు దొంగిలించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు బిజెపికి చెందిన వ్యక్తి కాబట్టి ఈ దారుణం జరిగిందని బిజెపి నేతలు విమర్శించారు. నిందితుడు అమల్ సర్కార్‌ను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Trinamool candidate attack on sisters
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News