Saturday, April 27, 2024

బ్రేక్ లేకుండా…

- Advertisement -
- Advertisement -

Trivikram Srinivas meets Jr NTR on New Year 2021

స్టార్ హీరో ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోయే రెండో సినిమా కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘అరవింద సమేత’ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్ సంయుక్తంగా నిర్మించబోతోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందట. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’లో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బ్రేక్ లేకుండా త్రివిక్రమ్ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రాజకీయ నేపథ్యంలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులపై త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానుందని టాక్. ఇక తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఎన్టీఆర్‌ను కలిసిన త్రివిక్రమ్ తమ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా ఈ చిత్రం రానుంది.

Trivikram Srinivas meets Jr NTR on New Year 2021

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News