Saturday, April 27, 2024

ఎందుకింత కక్ష.. వివక్ష!

- Advertisement -
- Advertisement -

TRS boycotts President's speech

అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని నిలదీసిన కెకె, నామా

తొలిరోజే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రయోజనాలు, హక్కులపై రాజీలేదన్న ఎంపీలు

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం మొదటి రోజునే టిఆర్‌ఎస్ పార్టీ డేంజర్ బెల్ మ్రోగించింది. ఇకపై తమ రూట్ సెపరేట్‌గా ఉంటుందన్న సంకేతాలను ఆ పార్టీ ఎంపీలు కేంద్రానికి తెలియజేశారు. రాష్ట్ర హక్కుల ప్రయోజనాలను కాపాడడానికి కేంద్రంతో ఎలాంటి పోరుకైనా సిద్ధమేనని తమ చర్యల ద్వారా ప్రత్యక్షంగా వెల్లడించారు. డ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉభయసభల (రాజ్యసభ, లోక్‌సభ)ను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించా రు. అయితే సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పార్టీ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు.

కేంద్రం నుంచి లేనందునే తెలంగాణ విషయంలో మోడీ సర్కార్ అనుసరిస్తు న్న వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి టిఆర్‌ఎల్ ఎంపీలు దూరంగా ఉన్నారు. కాగా రాష్ట్రప తి ప్రసంగం అనంతరం వర్చువల్‌గా జరిగిన అఖి ల పక్ష సమావేశంలోనూ నిరసన గళం వి ప్పారు. సమావేశానికి పార్లమెంటరీ పార్టీ పక్షా న హాజరైన కె. కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు లు కూడా వివిధ అంశాలపై కేంద్రాన్ని నిలదీశా రు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పెండిం గ్ అంశాలను ఈ సమావేశంలో వారు లేవనెత్తా రు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రతి విషయంలోనూ తెలంగాణపై కేంద్రం వివక్ష చూ పిస్తోందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్రం నుంచి సహాయం అందలేదనారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు మెడికల్ కా లేజీలు ఇచ్చారని, కానీ తెలంగాణకు మాత్రం ఒ క్కటీ ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అసలు ఎందుకు తెలంగాణను శత్రువుగా చూస్తున్నారు, ఎందుకు పెంచుకుంటున్నారని ఈ సందర్భంగా కెకె నిలదీశారు. పెండింగ్‌లో ఉన్న జిఎస్‌టి, ఐజిఎస్‌టి నిధులను రాష్ట్రాలకు విడుదల చేయడం లేదనిప్ర శ్నించారు. అలాగే వరి ధాన్యం సేకరణ లో టిఆర్‌ఎస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నట్లుగా జాతీయ సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని తీసుకురావాలన్నారు. బాయిల్డ్ రైస్ సమస్య ఒడిశాతో పాటు అనేక రాష్ట్రాలను బాధిస్తోందన్నారు.

బిజెపి ప్రభుత్వానికి స్పష్టమైన మెజారి టీ ఉందన్న భావనతో ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఐటి, ఇడి దాడులు చేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుతం పార్లమెంట్‌ను కూ డా బిజెపి ప్రభుత్వం వినియోగించుకుంటున్నదని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇందు లో భాగంగా ప్రివిలేజ్ కమిటీని కూడా ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అయితేపార్లమెంట్‌ను, కేంద్ర సంస్థలను కించపరచాలన్నది తమ ఉద్దేశ్యం కాదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తన అవసరాలకు వీటిని ఉపయోగించవద్దని అంటున్నామన్నారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై సమగ్రంగా, సజావుగా చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయన్నారు. రాష్ట్ర విభజన జరిగిన దాదాపు ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు విభజన సమస్యలను పరిష్కారం కాలేదన్నారు.

గత ఏడున్నర సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్ సమయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతున్నా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదన్నారు.శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియ కాగితాలకే పరిమితం అయిందన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన రూ.900 కోట్ల బకాయిలు ఇవ్వలేదన్నారు. అలాగే హైదరాబాద్‌లో ప్రతిపాదించిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడి)ను విశాఖకు తరలించారని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రాష్ట్రానికి తగు ప్రాధాన్యత…నిధులు కేటాయింపులు జరపకపోయినట్లు అయితే సభలను పూర్తిగా అడ్డుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News