Saturday, April 27, 2024

టిఆర్‌ఎస్ దూరం

- Advertisement -
- Advertisement -

TRS Decision not to attend opposition meeting

కాంగ్రెస్‌తో వేదిక పంచుకోవడం ఇష్టంలేకే విపక్షాల భేటీకి హాజరుకావొద్దని నిర్ణయం

రాష్ట్రపతి అభ్యర్థిని ముందే నిర్ణయించడంపై కినుక
ముఖ్యనేతలు, పార్టీ ప్రతినిధులు ఎవరూ హాజరు కాకూడదని నిర్ణయం
ప్రగతిభవన్‌లో సీనియర్ నేతలతో సిఎం కెసిఆర్ సుదీర్ఘ సమాలోచనలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి పదవికి విపక్షాల తరపున అభ్యర్థిని ఎంపిక చేసేందుకంటూ బుధవారం ఢిల్లీలో తలపెట్టిన సమావేశంలో పాల్గొనకూడదని టిఆర్‌ఎస్ నిర్ణయించింది. ముఖ్యనేతలు కానీ, ప్రతినిధులు కానీ ఈ సమావేశానికి హాజరు కాబోరని పార్టీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. టిఆర్‌ఎస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి నాలుగు ప్రధాన కారణాలున్నట్లు అవి వివరించయాయి. సో కాల్డ్ జాతీయ పార్టీలుగా పేర్కొంటున్న కాంగ్రెస్, బిజెపిల విషయంలో తమ విధానాన్ని టిఆర్‌ఎస్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఈ రెండింటికి సమానదూరంలో ఉంటాయని పేర్కొన్నది. ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తున్న పార్టీ ముఖ్యనేతలకు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ సమావేశానికి కాంగ్రెస్‌ను ఆహ్వానించడంపై టిఆర్‌ఎస్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్ విషయంలో తమకున్న అభ్యంతరాలు చెప్పినప్పటికీ కూడా ఆ పార్టీని ఆహ్వానించడం సరికాదనిప టిఆర్‌ఎస్ గట్టిగా అభిప్రాయపడుతున్నది. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారైన కాంగ్రెస్‌తో ఏ స్థాయిలోనూ వేదిక పంచుకునే అవకాశం ఉండనే ఉండదని టిఆర్‌ఎస్ వర్గాలు కుండబద్దలు కొట్టాయి.

మొన్నటికి మొన్నప కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్‌గాంధీ తెలంగాణకు వచ్చి బిజెపిని పల్లెత్తు మాట అనకపోగా టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేసి వెళ్లారని, అందువల్ల అలాంటి పార్టీతో కలిసి కూర్చొని చర్చించే ప్రశ్నే ఉత్పన్నం కాదని టిఆర్‌ఎస్ ముఖ్య నేతలు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ బిజెపితో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నదని, గత లోక్‌సభ ఎన్నికలు మొదలుకొని మొన్నటి హుజూరాబాద్ ఎన్నికల దాకా తనను తాను పణంగా పెట్టుకొని డిపాజిట్లు కోల్పోయి బిజెపిని గెలిపించే ప్రయత్నం చేస్తున్నదని, అందువల్ల అటువంటి కాంగ్రెస్‌ను నమ్మే సందర్భమే రాదని టిఆర్‌ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. అయినా విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఈ సమావేశం నిర్వహణ పద్ధతే సరిగా లేదని టిఆర్‌ఎస్ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో విపక్ష నేతలు కలిసి కూర్చొని ఎవరికీ ఇబ్బంది కలిగించని, అందరికీ ఆమోదయోగ్యమైన, ఏకాభిప్రాయ అభ్యర్థిపై ముందు చర్చిస్తారని, ఆ తరువాత ఆ అభ్యర్థిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ముందే ఒక అభ్యర్థిని అనుకొని అతనితో సంప్రదింపులు కూడా ప్రారంభించిన తరువాత సమావేశాలు పెట్టడంలో ఆంతర్యం ఏమిటని టిఆర్‌ఎస్ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కారణాల వల్ల ఈ సమావేశంలో పాల్గొనడం లేదని అవి స్పష్టం చేశాయి. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవాలనే దానిపై టిఆర్‌ఎస్ తరువాత నిర్ణయం తీసుకొంటుందని అవి వివరించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News