Friday, April 26, 2024

కేంద్ర మంత్రులు పట్టించుకోవడం లేదు: ఎంపి నామా

- Advertisement -
- Advertisement -

TRS MPs protest in Parliament on Paddy Issue

హైదరాబాద్: తెలంగాణ రైతాంగం సమస్యపై ఐదో రోజూ పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగించారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపి నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తాము ఐదు రోజుల నుంచి రాష్ట్ర రైతాంగ జీవన్మరణ సమస్యపై పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ జరుగుతున్న సమయంలో తాము డిమాండ్ చేస్తున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో వరి ధాన్యం సేకరణపై ఒక్కో కేంద్రమంత్రి, తెలంగాణకి చెందిన బిజెపి ఎంపీలు ఒక్కో విధంగా మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా దృష్టికి నామా తీసుకొచ్చారు. కేంద్రం ఈ విషయంలో ప్రకటన చేస్తే అసలైన సమాచారం తెలుస్తుందని ఎంపి అన్నారు.

TRS MPs protest in Parliament on Paddy Issue

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News