Saturday, May 4, 2024

వాహనదారులకు గుడ్ న్యూస్… ట్రాఫిక్ చలాన్లపై రాయితీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పెండింగ్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది మాదిరిగానే పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీలు ప్రకటించాలని తెలంగాణ పోలీసు శాఖ యోచిస్తోంది. భారీ రాయితీలు ప్రకటించి రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న చలాన్ల సంఖ్యను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. కాగా గత ఏడాది ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ప్రకటించడం మంచి ఫలితాలను ఇచ్చింది.

ఈ నెల 30వ తేదీ నుంచి పెండింగ్‌ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించనుంది. లోక్‌ అదాలత్ ద్వారా చలాన్లను క్లియర్ చేసుకోవాలని సూచన చేశారు. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై 90 శాతం రాయితీ.. టూవీలర్స్‌పై 80 శాతం రాయితీ.. ఫోర్ వీలర్స్‌, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్.. భారీ వాహనాలపై 50 శాతం రాయితీని ప్రకటించారు.

నవంబర్ 2023 చివరి నాటికి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న చలాన్‌ల సంఖ్య రెండు కోట్లకు చేరుతుందని అంచనా. ఈ సంఖ్యను వీలైనంత తగ్గించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. నిర్ణీత వ్యవధిలోగా చలాన్లు చెల్లించే వారికి మరో రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉండగా.. ప్రత్యేక రాయితీ ప్రకటించడంతో పలువురు వాహనదారులు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News