Saturday, May 4, 2024

నేటి నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు

- Advertisement -
- Advertisement -

TS EAMCET web options from today

హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 18) నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వెబ్ ఆప్షన్ల ఎంపికకు ఈ నెల 22వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్న అభ్యర్థులు వెంటనే వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా స్లాట్ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా, శనివారం నాటికి 55,518 మంది విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు.స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఈ నెల 19వ తేదీతో ముగియనుండగా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. స్పోర్ట్ కోటాలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని విద్యార్థులు ఈ నెల 19వ తేదీన మాసబ్‌ట్యాంక్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో హాజరుకావాలని ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. శనివారం నాటికి 43,721 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారని అన్నారు.ఈ నెల 24వ తేదీన మొదటి విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు.

TS EAMCET web options from today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News