Sunday, May 12, 2024

చిన్నారి మౌనిక కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అభం శుభం తెలియని చిన్నారి మౌనిక మృతి అందరినీ ఎంతో కలచివేసిందని, ఈ దుర్ఘాటన చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గత నెల 29 వ తేదీన కురిసిన భారీ వర్షం నేపథ్యంలో కళాసి గూడ నాలాలో పడి మృతి చెందిన చిన్నారి మౌనిక కుటుంబానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల రూ ఆర్థిక సహాయం చెక్కును డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతో కలిసి మంత్రి సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు వారి నివాసంలో అందజేశారు. తమ బిడ్డను తలుచుకుంటూ రోధిస్తున్న మౌనిక తల్లిదండ్రులు శ్రీనివాస్, రేణుకలను మంత్రి ఓదార్చారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. చిన్నారి మృతి ప్రతి ఒక్కరినీ ఎంతో కలచి వేసిందని, ఎంత చేసినా చిన్నారి లేని లోటును ఆ కుటుంబానికి తీర్చలేనిదన్నారు. నిరుపేదరికంలో ఉన్న మౌనిక కుటుంబం అవసరాలను తెలుసుకొని వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక చొరవతో కోట్లాది రూపాయల వ్యయంతో నగరం నెలకొన్న ముంపు సమస్యతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారి మరణం వారి కుటుంబానికి తీరని లోటని, ఆ బాధ ఎవరూ తీర్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ సుదర్శన్ తదితరులు ఉన్నారు.

Also Read: జంటనగరాల ప్రజలకు శుభవార్త..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News