Sunday, April 28, 2024

టీకా పంపిణీ కమిటీలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా పర్యవేక్షణకు ఏర్పాటు రాష్ట్ర 
సారథ్య సంఘంతో పాటు జిల్లా, మండల స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్‌లు 

రాష్ట్ర కమిటీకి ప్రధాన కార్యదర్శి సారథ్యం, సభ్యులుగా వివిధ శాఖలు కార్యదర్శులు
ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, రైల్వే, రక్షణ విభాగాల ప్రతినిధులు కన్వీనర్‌గా వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి

మన తెలంగాణ/హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి సరఫరా, పంపిణీ వంటి అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్టీరింగ్ కమిటీతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్‌లను నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్టీరింగ్ కమిటీలో వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, రైల్వే, రక్షణ విభాగంతో పాటు ఇతరులు సభ్యులుగా ఉంటారు. వైద్య ఆరోగ్య కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన డేటాబేస్ సిద్ధం చేయడం, వ్యవస్థ ఏర్పాటు, వసతులు, ఆర్థిక పరమైన ఏర్పాట్ల ప ర్యవేక్షణ, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పంపిణీ, అమలు, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలను స్టీరింగ్ కమిటీ చేపడుతుంది. పరిస్థితులు, అసవరాలకు అనుగుణంగా సిబ్బంది సాయంతో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్‌ఫోర్స్ విభాగాలు వ్యాక్సిన్ పంపిణీ పటిష్టంగా జరిగేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్ స్టీరింగ్ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైరపర్సన్‌గా, హెచ్‌ఎం అండ్ ఎఫ్‌డబ్లూ సెక్రటరీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మొత్తం 18 విభాగాలు స్టేట్ స్టీరింగ్ కమిటీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. స్టేట్ టాస్క్‌ఫోర్స్ కమిటీలో హెచ్‌ఎం అండ్ ఎఫ్‌డబ్లూ డిపార్టుమెంట్ ప్రభుత్వ కార్యదర్శి చైర్‌పర్సన్‌గా, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్‌ఫేర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మెంబర్స్‌గా వివిధ విభాగాలకు చెందిన పది మంది సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తారు. జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

వీరితో పాటు జిల్లాలోని వివిధ విభాగాలకు చెందిన 18 మంది సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తారు. మండల టాస్క్‌ఫోర్స్‌లో మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ చైర్‌పర్సన్‌గా, పిహెచ్‌సి మెడికల్ ఆఫీసర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మెంబర్స్‌గా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్స్ ఆఫ్ పిహెచ్‌సిలు, మండల పంచాయతీ ఆఫీసర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, డిస్కం కన్‌సర్న్‌డ్ ప్రాతినిధ్యం వహిస్తారు. అదే విధంగా డిస్టిక్ట్, మండల, మునిసిపల్, జిహెచ్‌ఎంసి కోఆర్డినేషన్ కమిటీలు నియమింపబడ్డాయి. డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్.. చైర్‌పర్సన్‌గా.. స్పెషల్ ఇన్వైటీగా కలెక్టర్ వ్యవహరిస్తారు. మెంబర్స్‌గా ఆయా విభాగాలకు చెందిన ఐదుగురు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఇక మండల కోఆర్డినేషన్ కమిటీలో మంల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ చైర్‌పర్సన్‌గా, మెంబర్ కన్వీనర్‌గా ఎంపిడీవో వ్యవహరిస్తారు. మెంబర్స్‌గా ఆయా విభాగాలకు చెందిన నలుగురు ప్రాతినిధ్యం వహిస్తారు. మునిసిపల్ కోఆర్డినేషన్ కమిటీలో మేయర్/మునిసిపల్ చైర్‌పర్సన్.. చైర్‌పర్సన్‌గా, మెంబర్ కన్వీనర్‌గా మునిసిపల్ కమిషనర్‌లు వ్యవహరిస్తారు. ఆయా విభాగాలకు చెందిన ముగ్గురు మెంబర్స్‌గా ప్రాతినిధ్యం వహిస్తారు. జిహెచ్‌ఎంసి కోఆర్డినేషన్ కమిటీలో మేయర్ చైర్‌పర్సన్‌గా, మెంబర్ కన్వీనర్‌గా కమిషనర్ వ్యవహరిస్తారు. ఆయా విభాగాలకు చెందిన ముగ్గురు మెంబర్స్‌గా ప్రాతినిధ్యం వహిస్తారు.

TS Govt to Forms 4 Committees for Corona Vaccine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News