Monday, April 29, 2024

నిధుల కొరత తీర్చండి

- Advertisement -
- Advertisement -

కేంద్రం నుంచి రావాల్సినవి సకాలంలో విడుదల కాక కష్టాల్లో ఖజానా

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి

ప్రధాని మోడీతో దాదాపు 30ని. ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం

పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు సహకారం అందించాలి
ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచి జిఎస్‌టి బకాయిలు విడుదల చేయాలి
హైదరాబాద్ వర్షాల నష్టం పూడ్చడానికి రాష్ట్రం కోరిన మేరకు నిధులు మంజూరు చేయాలని ప్రధాని మోడీని
ముఖ్యమంత్రి కెసిఆర్ కోరినట్టు సమాచారం
పార్లమెంట్ కొత్త భవనం శంకుస్థాపన చేసినందుకు ప్రధానిని అభినందించిన సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం రాత్రి సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ప్రధానితో దాదాపు అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధానితో సిఎం చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రధానంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. నిధులు సకాలంలో విడదల కాని కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై తీవ్ర ప్రభావం పడుతోందని సిఎం వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని మరోసారి సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేసినట్లుగా సమాచారం. అలాగే పాలమూరు..-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు కేంద్రం సహకారం అందించాలని సిఎం కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాదు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి పెంపుతో పాటు జిఎస్‌టి బకాయి నిధులను విడుదల చేయాలన్నారు.

అలాగే హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా పెద్దఎత్తున నష్టం వాటిల్లిందన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా తక్షణ నిధులు మంజూరు చేసే విషయంపై ప్రధానితో కెసిఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను శంకుస్థాపన చేసిన ప్రధానికి ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కాగా ఢిల్లీ పర్యటనలో సిఎం కెసిఆర్ ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరితో జరిగిన భేటీలో రాష్ట్రంలోని దేశీయ విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఆరు డొమెస్టిక్ ఎయిర్‌పోర్టులను త్వరగా మంజూరు చేయాలని కోరారు. కాగా రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రులు, అమిత్‌షా, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.

CM KCR Meets PM Modi in New Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News