Home తాజా వార్తలు రేషన్ డీలర్ల భర్తీ

రేషన్ డీలర్ల భర్తీ

Centre not approved for Ration Door Delivery in Delhi

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భర్తీ ప్రక్రియను ఆయా జిల్లాల కలెక్టర్లకు పూర్తి బాధ్యతలను కట్టబెట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,022 రేషన్ షాపులు ఉండగా, అందులో దాదాపుగా 1200 షాపులకు రేషన్ డీలర్లు లేరు. కొన్ని చోట్ల డీలర్లు చనిపోవడం, మరికొందరు స్వచ్చందంగా వదులుకోవడం, అలాగే కొన్ని అక్రమాలకు పాల్పడిన డీలర్లను తొలగించడం వంటి కారణాలతో చాలా ప్రాంతంలో డీలర్లు లేకుండా పోయారు. డీలర్లు లేని రేషన్ దుకాణాలను సమీపంలో ఉన్న డీలర్లకు అప్పగించి వారి ద్వారా రేషన్ షాపులను నెట్టుకుంటూ వస్తున్నారు.

అయితే కొన్ని చోట్ల ఒకే డీలర్‌కు రెండు, మూడు ప్రాంతాల్లో రేషన్ దుకాణాలు ఉండడంతో సరకులు పంపిణి కూడా సక్రమంగా జరగం లేదు. నిర్ణిత కాలంలో దుకాణాలు తెరచి ఉండడం లేదు. దీంతో రేషన్ సరకుల వచ్చే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని డీలర్ల అసోసియేషన్ సభ్యులు పలుమార్లు సఎం కెసిఆర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రేషన్ డీలర్ల సమస్యలను అర్ధం చేసుకున్న ఆయన సాధ్యమైనంత త్వరగా ఖాళీగా ఉన్న డీలర్ల నియమకం చేపడతామని హామి ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాం ఈ నిర్ణయం తీసుకుంది.

TS Govt to replacement of ration dealers