Wednesday, May 15, 2024

ఎంఎల్‌సి ఎన్నికల షెడ్యూల్

- Advertisement -
- Advertisement -

ఎంఎల్‌సి ఎన్నికల షెడ్యూల్ విడుదల
16న నోటిఫికేషన్, మార్చి 14న ఎన్నికలు
తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఎపిలో రెండు టీచర్ ఎంఎల్‌సి స్థానాలకు జరుగనున్న ఎన్నికలు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎంఎల్‌సి ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఎపిలో రెండు ఉపాధ్యాయ ఎంఎల్‌సి స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ జారీ చేసింది. తెలంగాణలో ఖమ్మం-వరంగల్-నల్గొండ, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా, మార్చి 14వ తేదీన పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. మార్చి 24న నామినేషన్లను పరిశీలించనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 26 చివరి తేదీ. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రస్తుతం పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావుల పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఎపిలోని ఉపాధ్యాయ నియోజకవర్గాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఎంఎల్‌సిలు రాము సూర్యారావు, ఎఎస్‌రామకృష్ణ పదవీకాలం కూడా మార్చి 29వ తేదీతో పూర్తికానుంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

TS Graduate MLC Elections 2021 on March 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News