Monday, April 29, 2024

అత్యాచారయత్నం కేసులో అరెస్టులు

- Advertisement -
- Advertisement -

ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం యత్నం కేసులో అదుపులో 11మంది అనుమానితులు 
గట్టి బందోబస్తులో ప్రత్యేక వాహనంలో ముగ్గురి తరలింపు
నిందితుల్లో పలువురు ఇసిఐఎల్, ఘట్‌కేసర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు
మల్కాజిగిరి డిసిపి రక్షిత కృష్ణమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు
నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రాంపల్లి గ్రామస్తుల ధర్నా

మన తెలంగాణ/కీసర, ఘట్‌కేసర్ రూరల్: నగర శివారులోని ఘట్‌కేసర్‌లో ఫార్మసీ విద్యార్ధినిపై సామూహిక అత్యాచారయత్నం సంఘటనకు సంబంధించి పోలీసులు గురువారం 11మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. భువనగిరి వద్ద అత్యాచారయత్నం సంఘటనతో సంబంధం ఉన్నట్లు బావిస్తున్న పలువురిని ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో పలువురు ఇసిఐఎల్, ఘట్‌కేసర్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానదితుల్లో ముగ్గురిని పటిష్ట బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో విచారణ కోసం మరో ప్రాంతానికి తరలించారు. మల్కాజిగిరి డిసిపి రక్షిత కృష్ణమూర్తి పర్యవేక్షణలో కీసర, ఘట్‌కేసర్ పోలీసులు సంయుక్తంగా కేసును ధర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు నిందితులను తక్షణం అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థిని స్వగ్రామమైన రాంపల్లి ఆర్‌ఎల్ నగర్ వద్ద స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను డిసిపి రక్షిత కృష్ణమూర్తి మీడియాకు వెల్లడించారు. మేడ్చల్ కండ్లకోయ సిఎంఆర్ కళాశాలలో బి ఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపల్లి ఆర్‌ఎల్ నగర్ ఓయు కాలనీకి చెందిన విద్యార్థిని (19) బుధవారం సాయంత్రం 6.15 గంటలకు రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సుదిగింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు గాను ఆటో ఎక్కి తల్లికి ఫోన్‌చేసి చెప్పింది. విద్యార్థిని ప్రయాణించిన ఆటోలో డ్రైవర్‌తో పాటు ఓ మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. కొంత దూరం వెళ్లాక మహిళ దిగిపోగా, ఆటోలో ఉన్న వ్యక్తి ఫోన్‌చేసి మరో ఇద్దరిని పిలిపించుకొని మార్గమధ్యలో ఆటోలో ఎక్కించాడు. ఇంతలో విద్యార్థిని దిగాల్సిన స్టేజీ వచ్చినప్పటికీ డ్రైవర్ ఆటోను ఆపకుండా ఘట్‌కేసర్‌వైపు వేగంగా వెళ్లాడు.

ఆటోను ఆపాలని విద్యార్థిని కోరినప్పటికీ వినిపించుకోక పోవడంతో ఇంటికి ఫోన్‌చేసి విలపిస్తూ తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది. వారు వెంటనే స్థానికుల సాయంతో 100కు డయల్ చేసి సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు బృందాలుగా వాహనాలలో విద్యార్థిని ఫోన్ సిగ్నల్‌ను వెంబడించారు. అప్పటికే ఆటోలో రాంపల్లి మీదుగా యంనంపేట్ వరకు వచ్చిన దుండగులు విద్యార్థిని మరో వాహనంలోకి మార్చారు. విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమె పై దాడిచేసి దుస్తులు చింపేశారు. పెనుగులాట కొనసాగుతుండగానే వాహనంలో ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసు బృందాలు త మను వెంబడిస్తున్నట్లు పోలీసు వాహనాల సైరన్‌ను గుర్తించిన దుండగులు భయంతో విద్యార్థినిని అవుట్ రింగ్ రోడ్డు అన్నోజిగూడ సర్వీసు రోడ్డు వద్ద వదిలి పారిపోయారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విద్యార్థిని ఉన్న ప్రాంతాన్ని గుర్తించి నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న పోలీసులు, సృహ తప్పి పడి ఉన్న ఆమెను వాహనంలో చికిత్స నిమిత్తం జోడిమెట్ల క్యూర్ ఆసపత్రికి తరలించారు. దుండగులు విద్యార్థినిని రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చడంతో గురువారం ఉదయం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మల్కాజిగిరి డిసిపి రక్షిత కృష్ణమూర్తి చికిత్స పొందుతున్న విద్యార్థినితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కుషాయిగూడ, మల్కాజిగిరి ఎసిపిలు శివకుమార్, శ్యాంప్రసాద్ పర్యవేక్షణలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపిన పోలీసులు మరో రెండు రోజుల్లో నింధితులను చట్టం ముందు ఉంచుతామన్నారు. ఘట్‌కేసర్ ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను ఎదురించిన అక్రమంలో బాధితురాలిని నిందితులు తీవ్రంగా గాయపర్చడంతో ఆమె తలకు, కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు డాక్టర్ సౌజన్యరెడ్డి మీడియాకు తెలిపారు. బిఫార్మసీ స్టూడెంట్‌పై లైంగిక దాడి జరిగిందని, అమ్మాయి ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికి అపస్మా రక స్థితిలో ఉందన్నారు. తలకు, కాళ్లకు గాయాలు కావడంతో చికిత్స చేసిన అనంతరం బాదితురాలు తీవ్ర భయాంతో ఉందన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్‌తో జరి గిన పెనుగులాటలో బాధితురాలి కుడికాలికి గాయ మైందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యురాలు సౌజన్యరెడ్డి తెలిపారు.

4 Accused arrested by police over Rape Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News