Saturday, April 27, 2024

బైంసాలో ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బైంసాలో ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భైంసాలో నిర్వహించే ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్‌కు ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశించింది. 500 మంది మాత్రమే ర్యాలీలో పాల్గొనాలని సూచించింది. మసీదుకు 300 మీటర్ల దూరంలో ర్యాలీ నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేనివారు మాత్రమే ర్యాలీలో పాల్గొనాలని ఆదేశించింది. మసీదు దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని, ర్యాలీలో పాల్గొనేవారు ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని తెలిపింది. మార్చి 5వ తేదీన భైంసాలో ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్‌కి అనుమతినివ్వాలని దాఖలైన పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ మేరకు హైకోర్టు ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్‌కు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

షర్మిల పాదయాత్ర పిటిషన్‌పై హైకోర్టు విచారణ
వైఎస్ షర్మిల పాదయాత్ర పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. పాదయాత్ర అనుమతికి ఎన్ని సార్లు కోర్టుకు వస్తారని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు నిబంధనలను ధిక్కరించి మాట్లాడుతున్నారని జిపి పేర్కొన్నారు. ఎంఎల్‌ఎ శంకర్‌నాయక్‌పై అభ్యంతరకర వ్యాఖ్యల వీడియోను జిపి న్యాయస్థానానికి అందజేశారు. వ్యక్తులను టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు..? అని హైకోర్టు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని షర్మిలకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News