Tuesday, May 21, 2024

12 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్..

- Advertisement -
- Advertisement -

12 నుంచి పాలిటెక్నిక్ కౌన్సెలింగ్
22న మొదటి విడత సీట్ల కేటాయింపు
అక్టోబర్ 15 నుంచి తరగతులు ప్రారంభం

TS Polycet 2020 Council starts from Sep 12

మనతెలంగాణ/హైదరాబాద్: పాలిసెట్-2020 కౌన్సెలింగ్ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి మొదటి విడుత ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. 12 నుంచి 17వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు స్లాట్ బుకింగ్ చేసుకుని, ఫీజు చెల్లించాలి. 14 నుంచి 18వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. 14 నుంచి 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి.ఈ నెల 22న మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 22 నుంచి 26వ తేదీలోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోరింగ్ చేయాలి. ఈ నెల 30 నుంచి పాలిసెట్ తుది విడుత ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. 30వ తేదీ నుంచి అక్టోబర్ 1 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. అక్టోబర్ 3న తుది విడుత ప్రవేశాలకు సంబంధించి సీట్లు కేటాయించనున్నారు. ఈ అక్టోబర్ 3 నుంచి 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు ఆయా కళాశాలల్లో కూడా రిపోర్టింగ్ చేయాలి. అదే నెల 7వ తేదీ నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. అక్టోబర్ 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లకు అక్టోబర్ 8న మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

TS Polycet 2020 Admission starts from Sep 12

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News