Friday, May 3, 2024

దక్షిణకొరియాను వణికించిన టైఫూన్.. 100 ఇళ్లు ధ్వంసం

- Advertisement -
- Advertisement -

దక్షిణకొరియాను వణికించిన టైఫూన్
100 ఇళ్లు ధ్వంసం, ఒకరు గల్లంతు

100 houses collapsed due to Typhoon in South Korea

సియోల్: దక్షిణకొరియాలోని తీరప్రాంత నగరాలను హాయిషెన్ టైఫూన్ వణికించింది. సోమవారం ఉదయం గంటకు 144 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, వరదలతో పలు నగరాలు జలమయమయ్యాయి. తీర నగరాలైన ఉల్సాన్, బుసాన్, సోక్చో, గ్యాంగ్‌న్యూంగ్, శ్యామ్‌చివోక్ వరద తాకిడికి గురయ్యాయి. రోడ్లపై చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈ నగరాల్లో 100కుపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఐదుగురు గాయపడ్డారు. శ్యాంచివోక్‌లో ఓ వ్యక్తి గల్లంతయ్యారు. జపాన్ దక్షిణ దీవులపైనా టైఫూన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. కాగోషిమాలో ఓ వృద్ధురాలు(70) మరణించారు. 38మంది గాయపడ్డారు. సాయంత్రానికి టైఫూన్ కాస్త నెమ్మదించినట్టు కొరియా వాతావరణశాఖ తెలిపింది.

100 houses collapsed due to Typhoon in South Korea

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News