Monday, April 29, 2024

ఇల్లెందు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

 

TSHC Sentenced illandu Municipal Commissioner to Jail

మనతెలంగాణ/హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలోని ఇల్లందు మున్సిపల్ కమిషనర్‌గా గతంలో పనిచేసిన అంజన్ కుమార్‌కు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే…ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నుంచి కరెంట్ ఆఫీసు వరకు గల మెయిన్ రోడ్డుపై ఆక్రమణలు తొలగించాలని పట్టణానికి చెందిన పెండెకట్ల యాకయ్య హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ మేరకు విచారణ చేసిన హైకోర్టు ఆర్ అండ్ బి రోడ్డుకిరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు కొన్నేళ్ల క్రితం తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును అమలు చేయకుండా గత మున్సిపల్ కమిషనర్ అంజన్ కుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఇల్లందు పట్టణానికి చెందిన పెండేకంటి యాకయ్య అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాడు.ఈ మేరకు విచారణ చేసిన హైకోర్టు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి కోర్టు తీర్పును అమలు చేయనందున అంజన్ కుమార్ కు రెండు నెలలు జైలు శిక్ష విధించింది.

TSHC Sentenced illandu Municipal Commissioner to Jail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News