Tuesday, March 19, 2024

అజయ్ చొరవతో ఆర్ టిసికి పూర్వవైభవం

- Advertisement -
- Advertisement -

మూడు నెలల్లో 359 బస్సుల పునరుద్ధరణ
కొత్త రూట్లకు 151 బస్సులు కేటాయింపు nపెరిగిన ట్రిప్పులు 1,934
ప్రయాణికుల వినతులు తక్షణం పరిష్కారం nప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్ సౌకర్యం
దశాబ్ధాలుగా నిలిచిన గ్రామాలకు బస్సుల పునరుద్ధరణ

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి : టీఎస్ ఆర్టీసీ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలతో ముందుకెళ్తుంది. కరోనా సంక్షోభ సమయంలో వివిధ మార్గాల్లో నిలిపివేసిన బస్సులను క్రమంగా పునరుద్ధరిస్తున్నది. సెప్టెంబర్ 3 నుంచి నవంబర్ 24 వరకు 359 బస్సులను పునరుద్ధరించింది. మరోవైపు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్త రూట్లలో 151 బస్సులను రంగంలోకి దింపింది. ఈ 510 బస్సుల ద్వారా రోజూ 1,934 ట్రిప్పులు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాధారణంగా రాష్ట్రంలో రోజూ దాదాపు 9,500 బస్సు లు సగటున 80 వేల ట్రిప్పుల వరకు తిరుగుతుంటాయి. ప్రయాణికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారికి మరింత చేరువయ్యేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రయత్నిస్తున్నది. బస్సులు కావాలంటూ వచ్చే వినతులపై మంత్రి పువ్వాడ ప్రత్యేక దృష్టి సారించడంతో అనుకున్న ఫలితాలు కనబడుతున్నాయి. కార్గో విధానం వల్ల ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూర్చుకుంటున్న విషయం తెలిసిందే.
ఆర్టీసీకి పెరుగుతున్న ఆదాయం
నష్టాల బాటలో నడుస్తున్న టీఎస్‌ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం.. మరోవైపు పూర్తిస్థాయి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ల నియామకంతో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. కొవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడం కూడా ఆర్టీసీ అదనపు ఆదాయానికి కారణం అవుతున్నది. గతంతో పోలిస్తే రోజుకు రూ.2 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తున్నట్టు ఆర్టీసీ ఉన్నతాధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టులో రోజుకు రూ.9.6 కోట్లుగా ఉన్న ఆర్టీసీ ఆదాయం.. నవంబర్ నెలకు వచ్చేసరికి కొంత పుంజుకున్నది. ఈ నెలలో రోజుకు సగటున రూ.2 కోట్ల మేర ఆదాయం పెరిగి రూ.11.50 కోట్లు సమకూరాయి. గతంతో పోలిస్తే ప్రయాణదూరం 5 లక్షల కిలోమీటర్లు పెరిగినట్టు అధికారులు తెలిపారు. ఈ నెలలో సగటున రోజుకు 33 లక్షల కిలోమీటర్లను ఆర్టీసీ బస్సులు కవర్ చేస్తున్నాయి.
మారుమూల గ్రామాలకు పల్లె వెలుగు
ఆర్టీస్నీష్టాల నుంచి లాభాల బాట పట్టించేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నది. అందులో భాగంగానే కొన్ని కొన్ని గ్రామాల రూట్లకు దశాబ్దాల క్రితం ఆపివేసిన పల్లె వెలుగు బస్సు సర్వీస్‌లను తిరిగి ప్రారంభించి ప్రజాదరణ పొందుతున్నది. ప్రజల విజ్ఞప్తుల మేరకు మారుమూల గ్రామాలకు బస్సులు నడుపుతున్నది. టీఎస్ ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. గతానికంటే భిన్నంగా మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నది. అంతేకాదు, శుభకార్యాలు, పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకూ ఎటువంటి డిపాజిట్ లేకుండా బస్సులను నడిపేందుకు సంస్థ సంసిద్ధంగా ఉంది. మాలధారణ భక్తులకు, పెళ్లిళ్లకు, విహారయాత్రకు 50మంది ప్రయాణికులు ఉంటే నేరుగా అక్కడికే బస్సును పంపిస్తున్నది. రానున్నరోజుల్లో తల్లీపిల్లల ఫీడింగ్ సెంటర్లను కూడా ఆయా పరిధిలో ఏర్పాటు చేయనున్నది. ఖమ్మం వేయడంలో ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టిసి బ స్సులను నడుపుతున్నారు. రఘునాథపాలెం, కూసుమంచి మండలాల్లోని విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టిసి బస్సులు స్కూల్ బస్సులుగా మారాయి
అద్దెకు ఆర్టిసి బస్సులు
శుభకార్యాలు, పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు ఎటువంటి డిపాజిట్ లేకుండా బస్సులను నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో డిపాజిట్ చేస్తేనే బస్సులను అద్దెకు ఇచ్చేవారు. కానీ ఆర్టీసీకి మరింత ఆదరణ పెంచాలని, సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయాణికులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది. మాలధారణ భక్తులకు, పెళ్లికి, విహారయాత్రకు 50మంది ప్రయాణికులు ఉంటే నేరుగా అక్కడికే బస్సును పంపిస్తున్నది. రానున్నరోజుల్లో తల్లీపిల్లల ఫీడింగ్ సెంటర్లను కూడా ఆయా పరిధిలో ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News