Monday, April 29, 2024

టిఎస్ ఆర్టీసి సిబ్బంది సంస్థ అభివృద్ధికి పాటుపడాలి: ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి సిబ్బంది సంస్థ అభివృద్ధికి పాటుపడాలని ఆర్టీసి చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయ, సహకారాలతో టిఎస్ ఆర్టీసి సంస్థ మరింత పురోగతి సాధిస్తుందని, సంస్థలో ఉన్న పెండింగ్ బకాయిలు చెల్లించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సంస్థలో ఉన్న సిబ్బంది కష్టపడి పనిచేసి సంస్థ లాభాలు వచ్చేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ఆదివారం భద్రాచలం సీతారాముల ను దర్శనాన్ని కుటుంబ సమేతంగా టిఎస్ ఆర్టీసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం భద్రాచలం టిఎస్ ఆర్టీసి బస్‌డిపోను ఆయన సందర్శించారు. అనంతరం డిపో ఆవరణలో హరిత తెలంగాణ కార్యక్రమంలో భాగంగా బాజిరెడ్డి గోవర్ధన్ మొక్కను నాటారు. బస్ డిపోలో నిర్వహిస్తున్న కార్యకలపాలను ఆర్టీసి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈనెల 27వ తేదీన బస్‌స్టేషన్‌లలో మెగా రక్తదాన శిబిరాలు
ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ టిఎస్ ఆర్టీసి ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీన బస్‌స్టేషన్‌లలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని, ఈ రక్తదాన కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని, ప్రతి ఒక్కరూ ప్రాణదాతలుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలను పాల్గొనే విధంగా ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. టిఎస్ ఆర్టీసి సంస్థ పూర్వ వైభవాన్ని సంత రించుకోవాలని, పూర్తిగా నష్టాలను దాటుకొని లాభాల వైపు పయనించాలని స్వామివారిని ప్రార్థించానని ఆయన తెలిపారు. భద్రాద్రి స్వామి వారి దర్శనానికి వస్తున్న ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని చైర్మన్ సిబ్బందిని కోరారు. శ్రీ భద్రాద్రి రామయ్య దేవస్థానం బ్రహ్మోత్సవాలు, ప్రత్యేకమైన విశేష రోజులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆయన ఉద్యోగులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి ధర్పల్లి బాజిరెడ్డి జగన్మోహన్, బాజిరెడ్డి అజయ్ గారు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ భవానీ ప్రసాద్, భద్రాచలం డిపో మేనేజర్ రామారావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News