Thursday, May 9, 2024

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసి బంద్..

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసి బంద్ కు శనివారం ఉదయం ఆర్టీసి మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్టీసి ప్రభుత్వ విలీనం బిల్లుపై అయోమయం నెలకొన్నది. ఈబిల్లు పరిశీలనకు న్యాయ సలహా కోసం సమయం కావాలని గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆర్టీసి బిల్లును ఆమోదించాలని ఈరోజు ఆర్టీసి టిఎంయూ నిరసన చేపట్టింది. ఉదయం 8 గంటల వరకు ఆర్టీసి బస్సులు బంద్ పాటించి నిరసన తెలిపేందుకు యూనియన్ నిర్ణయించింది. దీంతో ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం 10 గంటలకు ఆర్టీసి కార్మికులు నెక్లెస్ రోడ్డుకు రావాలని యూనియన్ పేర్కొంది.

ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ వద్ద ఆర్టీసి కార్మికులు నిరసన తెలుపనున్నారు. ఆర్టీసి బిల్లుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై కోరారు. ఆర్టీసి ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వివరణ కోరినట్లు రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. బిల్లుపై త్వరగా నిర్ణయం తీసుకునేలా తక్షణమే సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News