Friday, May 10, 2024

అభివృద్ది పనులను వేగవంతం చేయండి

- Advertisement -
- Advertisement -
TSSPDCL CMD said Accelerate development work
టిఎస్‌ఎస్‌పిడిసీఎల్ సీఎండి రఘుమారెడ్డి

హైదరాబాద్: విద్యుత్ శాఖలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలని దక్షణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ఎస్‌పిడిసీఎల్)సీఎండి జి.రఘుమారెడ్డి అధికారులను ఆదేశించారు. సైబర్ సర్కిల్ పరిధిలోని నార్సింగ్ పట్టణంలో రూ.3.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సబ్‌స్టేషన్ ద్వారా నార్సింగి, అల్కాపురి కాలనీ, పుప్పాలగూడ ప్రాంతాల్లో నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ పంపిణీ అందించవచ్చని పేర్కొన్నారు.. తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన 30 మొక్కలను నాటారు. అనంతరం సీఎండి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భావితరాలకు ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని అందించాలనే దూరదృష్టితో తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని రూపొందించారన్నారు.

దక్షణ తెలంణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని సబ్‌స్టేషన్లు, కార్యాలయ ఆవరణలో సుమారు రెండు లక్షలమొక్కలను నాటడం జరిగిందన్నారు. తమ శాఖ పరిధిలో 20వేల 500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, ప్రతి ఉద్యోగి తమ కుటుంబాల తరపున ఆరు మొక్కలు నాటాలని అలా జరిగితే సుమారు 1.25 లక్షల మొక్కలు భావితరాలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బహుమానంగా ఇచ్చినట్లువుతుందన్నారు. మ్కొకలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంతో పాటు ఆయన రంగారెడ్డి జోన్ పరిధిలోని అధికారులతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో నిర్వహిస్తున్న వివిధ పురోగతిపై కూడా ఆయన సమీక్ష నిర్వహించారు.

ఇందులోభాగంగా ఇంటర్మీడియట్, పోల్స్ ఏర్పాటు, వంగిన ,తుప్పుపట్టి పాడై పోయిన పోల్స్ మార్పుచడం పైనే కాకుండా దెబ్బతిన్న వైర్ల మార్పిడి, వదులుగా ఉన్న తీగలను సరిచేయడం, వీది దీపాలకు ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు, పాడైన వీది దీపాలు మార్పిడి, వీది దీపాలకు ప్రత్యేక మీటర్ బాక్స్‌ల ఏర్పాటు తదితర పనులు కూడా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర శాఖల అధికారుల సమన్వయంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరక్టర్లు టి.శ్రీనివాస్, జె. శ్రీనివాసరెడ్డి, కె.రాములు, జి.పర్వతం, సిహెచ్. మధున్ మోహన్ రావు,ఎస్. స్వామిరెడ్డి, పి. నరసింహరావు, సీజీఎంలు, పాండ్య. పి. ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News