Tuesday, April 30, 2024

బర్త్‌డే కానుకగా టీజర్..

- Advertisement -
- Advertisement -

నాని కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘టక్ జగదీష్’. ఈ చిత్రం టీజర్ నాని బర్త్‌డే సందర్భంగా ఈనెల 23న సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మోషన్ పోస్టర్‌తో ఉత్కంఠ పెంచింది టీమ్. శివ నిర్వాణ మరోసారి తనదైన మార్క్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ని అందిస్తున్నారని అర్థమవుతోంది. ఈ మోషన్ పోస్టర్‌లో బురదలో దిగిన నాని గునపం పట్టి కోపంగా చూస్తూ కనిపించాడు. రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tuck Jagadish movie teaser to release on Feb 23

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News