Saturday, May 4, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 215 గ్రాముల ఎండిఎంఏ, రూ.8,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌జోన్ డిసిపి జోయల్‌డేవిస్ తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం, ప్రతాప్‌ఘర్‌కు చెందిన ప్రదీప్ శర్మ అలియాస్ కమాల్ రాణా హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కామారెడ్డి జిల్లా, బిచుకుంటు మండలం, దేవాడ గ్రామానికి చెందిన మటంవార్ వీరేందర్ అలియాస్ వీరు కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు.

వీరేందర్, నరేష్ చౌదరితో కలిసి నగరంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రదీప్ శర్మ పరారీలో ఉన్నాడు. జైలు నుంచి బయటికి వచ్చిన వీరేందర్ ప్రదీప్ శర్మకు ఫోన్ చేసి ఎండిఎంఏ డ్రగ్స్ కావాలని చెప్పడంతో 215 గ్రాములు తీసుకుని హైదరాబాద్‌కు వచ్చాడు. డ్రగ్స్‌ను వీరేందర్‌కు ప్రదీప్ ఇస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు రవీంద్రప్రసాద్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News