Wednesday, May 1, 2024

రెండు కేసులే

- Advertisement -
- Advertisement -

Corona

 

ఆ రెండు పాజిటివ్‌లు జిహెచ్‌ఎంసిలోనే

1003కు చేరిన కరోనా బాధితులు 16 మంది డిశ్చార్జి, చికిత్స తీసుకుంటున్న 646 మంది ప్లాస్మా ఇచ్చేందుకు 15 మంది అంగీకారం
గాంధీ ఆసుపత్రిలో మాంసాహారానికి అనుమతి లేదు అవసరమైతే డ్రైఫ్రూట్స్ తీసుకురండి : సూపరింటెండెంట్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా అదుపులోకి వస్తుంది. సోమవారం కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు కాగా, 16 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన కేసులు జిహెచ్‌ఎంసి పరిధిలో నమోదు కావడం గమనార్హం. గత రెండు రోజులుగా మిగతా జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాకపోవడమే కాగా, 12 జిల్లాలను అధికారులు కరోనా ఫ్రీగా ప్రకటించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బాధితులు 1003కి చేరగా, 332 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో వేర్వేరు ఆసుపత్రుల్లో 646 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన 25 మరణాల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 18, రంగారెడ్డి(నాన్ జిహెచ్‌ఎంసి)లో 2, మేడ్చల్(నాన్‌జిహెచ్‌ఎంసి) వికారాబాద్, గద్వాల్ , మహబూబ్‌నగర్, నారాయణపేట్ జిల్లాల్లో ఒక్కోక్కటి చొప్పున సంభవించాయి.

12 జిల్లాల్లో కరోనా ఫ్రీ……
రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుతోంది. గత రెండు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కానీ జిల్లాలను అధికారులు కరోనా ఫ్రీగా ప్రకటించారు. మొత్తం 12 జిల్లాలను కరోనా ఫ్రీగా ప్రకటించి, ఆయా ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఉంటే, తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన క్లస్టర్లలో సగం వరకు ఎత్తివేసినట్లు సమాచారం. కరోన ఫ్రీగా ప్రకటించిన జిల్లాల్లో సంగారెడ్డి, సిద్దిపేట్, భద్రాద్రి, నాగర్‌కర్నూల్, ములుగు, పెద్దపల్లి, మహబూబ్‌బాద్ ,మంచిర్యాల, నారాయణపేట్, వనపర్తి, యాదాద్రి, వరంగల్ రూరల్ జిల్లాలు ఉన్నాయి.

ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వస్తున్న డోనర్లు…..
ప్లాస్మాథెరఫీకి అవసరమయ్యే ప్లాస్మానిచ్చేందుకు తెలంగాణ రాష్ట్రంలో డోనర్లు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ -19 ఎదుర్కోవడంలో భాగంగా ప్లాస్మా థెరపీ చికిత్సను ఉపయోగించేందుకు గాంధీ ఆస్పత్రి సిద్ధమవుతోంది. పూర్తిస్థాయిలో కరోనా ఆసుపత్రిగా మారిన గాంధీలో ప్లాస్మా థెరపీ కోసం అవసరమైన ప్రక్రియను మొదలు పెట్టినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో 15 మంది తమ ప్లాస్మాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు ఆయన వివరించారు.

ఇప్పటికే యూఎస్‌ఏ, చైనా, దక్షిణ కొరియాల్లో ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలను ఇచ్చినట్టుగా పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఫ్లాస్మాథెరఫీ విధానం ద్వారా పలువురికి చికిత్స చేసింది. అక్కడ సత్ఫలితాలు రాగా, తెలంగాణ ప్రభుత్వం కూడా ఐసిఎంఆర్‌ను అనుమతి కోరింది. దీంతో వారి మూడు రోజుల క్రితమే అనుమతి లభించగా, తెలంగాణలోనూ ప్లాస్మాథెరఫీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలో ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన 15 మంది నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తో సమన్వయంతో ఏడుగురు సభ్యుల కమిటీ నిబంధనల ప్రకారం సంతకాలను తీసుకున్నట్లు సమాచారం.

గాంధీలో మాంసాహారానికి అనుమతి లేదుః సూపరింటెండెంట్
గాంధీలో మాంసాహారానికి అనుమతి లేదని సూపరింటెండెంట్ డా రాజారావు మరోసారి స్పష్టం చేశారు. రోగులకు ఇంటి నుంచి ఎవరైన మాంసాహారం తీసుకువస్తే ఎట్టి పరిస్థితుల్లో లోపలకి పంపించబోమని ఆయన చెప్పారు. రంజాన్ మాసం సందర్బంగా ఇప్తార్ కోసం బయటి వ్యక్తులు తీసుకొచ్చే మాంసాహారాన్ని కూడా అనుమతించబోమని ఆయన వెల్లడించారు. దీనికి బదులు పండ్లు, డ్రైప్రూట్స్ తెచ్చి ఇవ్వాలని ఆయన కోరారు. గత మూడు రోజులుగా గాంధీ ఆసుపత్రిలో రోగులకు మాంసాహారం అందిస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన కొట్టిపరేశారు.

 

Two corona cases registered
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News