Sunday, May 5, 2024

ఎసిబి వలలో ఇద్దరు జిహెచ్‌ఎంసి ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

GHMC Employees

 

హైదరాబాద్ ః నగరంలోని జిహెచ్‌ఎంసికి చెందిన ఇద్దరు ఉద్యోగులు వేర్వేరు ప్రాంతంలో లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. ఈక్రమంలో (మల్కాజిగిరి) సర్కిల్ 28 ట్యాక్స్ ఇన్సెక్టర్ సయ్యద్ కుదాబక్ష్ ను ఎసిబి అధికారులు శనివారం రూ. 14వేలు లంచం తీసుకున్న కేసులో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మల్కాజిగిరి నివాసి ఎం.భార్గవి మిర్జల్‌గూడాలో నూతనంగా నిర్మించిన ఫస్ట్ ఫ్లోర్ భవనానికి ట్యాక్స్ విషయంలో జిహెచ్‌ఎంసి (మల్కాజిగిరి) సర్కిల్ 28 ట్యాక్స్ ఇన్సెక్టర్ సయ్యద్ కుదాబక్ష్ ను సంప్రదించాడు. తనకు రూ. 14వేలు లంచంగా ఇవ్వాలని ట్యాక్స్ ఇన్సెక్టర్ సయ్యద్ కుదా బక్ష్ డిమాండ్ చేయడంతో పాటు లంచం మొత్తాలను తన భార్య అకౌంట్‌కు పంపించాలని సూచించాడు.

పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసిన సర్కిల్ 28 ట్యాక్స్ ఇన్సెక్టర్ సయ్యద్ కుదాబక్ష్‌పై భార్గవి నేరుగా ఎసిబి అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేయడంతో ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అనంతరం ట్యాక్స్ ఇన్సెక్టర్ సయ్యద్ కుదాబక్ష్ ను ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. అలాగే జిహెచ్‌ఎంసి సర్కిల్ 29లో ఇంటి ట్యాక్స్ ఫైల్‌కు సంబంధించి శుక్రవారం రూ. 5వేలు లంచం తీసుకున్న కేసులో ట్యాక్స్ సెక్షన్‌లోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన విషయం విదితమే. కాగా ఎసిబి అధికారులు ఈ కేసు విచారణలో ట్యాక్స్ సూపరింటెండెంట్ నల్లగొప్పుల ఐలయ్య ఆదేశాల మేరకు తాను లంచం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఐలయ్య విషయం తెలుసుకుని పరారయ్యాడు. ఈక్రమంలో పరారీలో ఉన్న ఐలయ్యను శనివారం అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు.

కాగా మహమ్మద్ అబ్దుల్ రియాజ్ తన భార్య ఇంటి పన్ను ఫైల్‌కు సంబందించి ట్యాక్స్ సూపరింటెండెంట్ ఐలయ్యను సంప్రదించడంతో తన వద్ద పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్‌ను కలిసి రూ. 5వేలు ఇవ్వాలని తెలిపాడు. లంచం డిమాండ్ చేసిన ట్యాక్స్ సూపరింటెండెంట్ ఐలయ్య, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్‌లపై అబ్దుల్ రియాజ్ ఎసిబి అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు లంచం తీసుకుంటుండగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్‌ను శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి దాడులను పసిగట్టి పరారైన ట్యాక్స్ సూపరింటెండెంట్ నల్లగొప్పుల ఐలయ్య అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. దీంతో లంచం డిమాండ్ చేసిన కేసులో హెచ్‌ఎంసి (మల్కాజిగిరి) సర్కిల్ 28 ట్యాక్స్ ఇన్సెక్టర్ సయ్యద్ కుదాబక్ష్, సర్కిల్ 29 ట్యాక్స్ సూపరింటెండెంట్ నల్లగొప్పుల ఐలయ్యలకు 14 రోజుల రిమాండ్ విధించారు.

Two GHMC Employees in ACB trap
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News