Saturday, May 4, 2024

50 రోజుల తరువాత మళ్లీ రైలు కూత

- Advertisement -
- Advertisement -

train-service

 న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన మొదటి రెండు రైళ్లు
17న న్యూఢిల్లీ సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు
20న సికింద్రాబాద్ న్యూఢిల్లీ రైలు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల రద్దయిన రైళ్ల సర్వీసులు 50 రోజుల తరువాత మళ్లీ మంగళవారం ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీ నుంచి 2299 మంది ప్రయాణికులతో రెండు రైళ్లు బయలుదేరాయి. న్యూఢిల్లీ బిలాస్‌పూర్ స్పెషల్ రైలు 1177 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 4 గంటలకు న్యూఢిల్లీ డిబ్రుగర్ స్పెషల్ రైలు 1122 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 4.45 కు బయలుదేరాయి. న్యూఢిల్లీబెంగళూరు స్పెషల్ రైలు రాత్రి 9.15 గంటలకు 1162 మందితో బయలుదేరుతుంది. ఢిల్లీ నుంచి మంగళవారం మొత్తం 3461 మంది ప్రయాణికులు బయలుదేరారు.

ప్రయాణికులు స్టేషన్ లోకి రాగానే వారు తమ మొబైల్‌లో ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నదీ లేనిదీ రైల్వే అధికారులు ఆరా తీశారు. చాలామంది ధ్రువీకరించారు. బిలాస్ పూర్ రైలు ప్రయాణికులు గేట్ల వద్దనే తమ చేతులను శానిటైజ్ చేసుకున్నారు. మాస్క్‌లు ధరించారు. చాలా తక్కువ లగేజీ తీసుకొచ్చారు. ప్లాట్‌ఫారం పై రద్దీ ఏర్పడకుండా ప్రయాణికులు రాగానే వారికి కేటాయించిన కోచ్‌ల్లో అధికారులు పంపించారు. ఈ సందర్భంగా రైల్వే బోర్డు ఛైర్మన్ వికె యాదవ్ కూడా స్టేషన్‌లో హాజరయ్యారు. మంగళవారం మరో ఐదు రైళ్లు ఢిల్లీకి పాట్నా, బెంగళూరు, హౌరా, అహ్మదాబాద్ నుంచి రావలసి ఉంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు అజ్మేరి గేట్ ద్వారా ప్రయాణికులను అనుమతించడం లేదు. పహర్‌గంజ్ వైపునే అనుమతించారు.

12 నుంచి 20 వరకు నడిచే రైళ్లకు మాత్రమే టైమ్‌టేబుల్ ప్రకటించారు. రాజధాని రైళ్ల ఛార్జీలే ఈ రైళ్లకు ఛార్జీగా వర్తిస్తాయి. 13న ఢిల్లీ నుంచి హౌరా, రాజేంద్ర నగర్, జమ్ము తవి, తిరువనంతపురం, చెన్నై, రాంచి, ముంబైసెంట్రల్, అహ్మదాబాద్‌కు ఎనిమిది రైళ్లు బయలుదేరుతాయి. 14న న్యూఢిల్లీ నుంచి భువనేశ్వర్‌కు ఒకే ఒక్క రైలు వెళ్తుంది. 15న న్యూఢిల్లీకి తిరువనంతపురం, చెన్నై సెంట్రల్ నుంచి ఒకే ఒక్క రైలు వంతున బయలుదేరుతుంది.

టైమ్‌టేబిల్ ప్రకారం 16,19 తేదీల్లో ఏ రైలు షెడ్యూలు లేదు. 17న మడగాన్ నుంచి న్యూఢిల్లీ, న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. 18న అగర్తలా నుంచి న్యూఢిల్లీకి ఒకేఒక్క రైలు నడుస్తుంది. 20న న్యూఢిల్లీ నుంచి అగర్తలా, సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ రైళ్లు నడుస్తాయి.

Two Trains Depart from New Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News