Sunday, May 12, 2024

పాక్ క్షిపణి ప్రయోగం తుస్సు…

- Advertisement -
- Advertisement -

Pak missile test failed
ఇస్లామాబాద్: పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంలా ఉంది పాకిస్థాన్ పని. ఇటీవల భారత్ క్షిపణి ఒకటి ప్రయోగంలో విఫలమై పాకిస్థాన్ భూభాగంలో పడింది. దానికి పాక్ నానా యాగి చేయడమేకాక, దర్యాప్తును కూడా నిర్వహించాలని కోరింది. అయితే ఈ నేపథ్యంఓల తన సామర్థాన్ని ప్రదర్శించేందుకు పూనుకుంది. తాజాగా ఓ క్షిపణి ప్రయోగం చేపట్టడంతో అది కాస్తా విఫలమయింది. పాక్ మీడియా దీనిపై కథనాలు వెలువరించింది.
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతానికి చెందిన జంషోరోలో గురువారం ఓ గుర్తు తెలియని వస్తువు గాల్లోకి ఎగిరి కింద పడటాన్ని స్థానికులు గుర్తించారు. ఆ వస్తువు తర్వాత క్షిపణి అని తేలింది. పాక్ గురువారం ఉదయం 11.00 గంటలకు ఓ క్షిపణి ప్రయోగాన్ని సింధ్‌లోని టెస్ట్ రేంజ్‌లో చేపట్టింది. ట్రాన్స్‌పోర్టర్ ఎరెక్టర్ లాంఛర్‌లో సమస్య ఏర్పడ్డంతో గంట వాయిదా వేశారు. కానీ తర్వాత 12.00 గంటల ప్రాంతంలో క్షిపణి గాల్లోకి లేచింది. కానీ కొద్ది సెకన్లకే ఆ క్షిపణి లక్షిత మార్గం నుంచి తప్పి నేల కూలింది. కాగా అది క్షిపని కాదని…సాధారణ మోర్టార్ ట్రేసర్ రౌండ్ అని స్థానిక అధికారులు వాదించినట్లు కథనం. కానీ అది కచ్చితంగా రాకెట్ లేదా క్షిపణి అని సమాచారం. దీనిపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారట.

https://twitter.com/PSFAERO/status/1504393394415706115?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1504396487479939075%7Ctwgr%5Ehb_2_8%7Ctwcon%5Es2_&ref_url=https%3A%2F%2Fwww.opindia.com%2F2022%2F03%2Fpakistan-unidentified-object-falls-from-sky-a-failed-missile-test-speculated%2F

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News