Saturday, April 27, 2024

మన సింధుకు ఘనస్వాగతం

- Advertisement -
- Advertisement -

Union ministers Honored Sindhu

 అభినందనల వెల్లువ, ప్రశంసల జల్లు సత్కరించిన
కేంద్రమంత్రులు వ్యక్తిగత కోచ్ పార్క్ తెసాంగ్‌తో కలిసి
మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న అసమాన
విజేత అభినందన సభలో కేంద్రమంత్రులు నిర్మలా
సీతారామన్, కిషన్‌రెడ్డి, అనురాగ్‌ఠాకూర్, తదితరుల
అపురూప సన్మానం అందుకున్న ఒలింపిక్ కాంస్య విజేత

టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగుతేజం పి.వి.సింధుకు రాజధాని ఢిల్లీలో అపూర్వ గౌరవం దక్కింది. టోక్యో నుంచి మంగళవారం ఢిల్లీకి చేరుకున్న సింధుకు విమానాశ్రయంలో బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సింధు తన వ్యక్తిగత కోచ్ పార్క్ తెసాంగ్‌తో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ చేరుకుంది. పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్న సింధు అభిమానులు ఆమెకు నీరాజనం పలికారు. అనంతరం అక్కడి రాజధాని ఢిల్లీలో అభినందన సభను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో పలువరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, నిశిత్ ప్రమాణిక్‌ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొని తెలుగుతేజాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సింధు ప్రతిభను వారు కొనియాడారు. ఒలింపిక్ క్రీడల్లో రెండు పతకాలు సాధించి భారత ఖ్యాతిని ఇనుమడింప చేసిందని ప్రశంసించారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. సింధు విజయం కోట్లాది మంది క్రీడాకారులకు స్ఫూర్తిని ఇస్తుందని వారు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News