Monday, May 6, 2024

భారత్‌ను ఆ విషయంలో ప్రోత్సహించలేం..

- Advertisement -
- Advertisement -

US Comments on India deal with Russia for defence

భారత్‌ను ఆ విషయంలో ప్రోత్సహించలేం
రష్యాతో బంధంపై అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్-రష్యా బంధంపై అగ్రరాజ్యం అమెరికా మరోమారు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ తన రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడడాన్ని అమెరికా ఏమాత్రం ప్రోత్సహించడం లేదని ఆ దేశ రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ అభిప్రాయపడింది. 2018లో భారత్ ఎస్400 గగనతల క్షిపణి వ్యవస్థ కొనుగోలు నిమిత్తం రష్యాతో ఐదు బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందాన్ని అమెరికా అప్పటినుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. అయినప్పటికీ పొరుగుదేశాలనుంచి పొంచి ఉన్న ముప్పు దృష్టా భారత్ ఈ విషయంలో ముందుకే వెళ్లింది. ఇదే ఎస్400 వ్యవస్థలను కొనుగోలు చేసిన టర్కీపై అమెరికా ‘కాట్సా’ ఆంక్షల్ని ప్రయోగించింది. ‘రక్షణ అవసరాల నిమిత్తం భారత్ సహా ఏ దేశమూ రష్యాపై ఆధారపడొద్దు. ఈ విషయంలో మా వైఖరిని స్పష్టంగా, నిక్కచ్చిగా తెలియజేశాం.

దీన్ని మేము ఏ మాత్రం ప్రోత్సహించడం లేదు. అదే సమయంలో భారత్‌తో ఉన్న మా రక్షణ భాగస్వామ్యానికి విలువ ఇస్తాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నాం. అది మాకు చాలా ముఖ్యం. ప్రాంతీయంగా భారత్ ఓ రక్షణ ఛత్రంలాగా పనిచేస్తోంది. దానికి మేం విలువ ఇస్తున్నాం’ అని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ విలేఖరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ వైఖరిపట్ల అమెరికా తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.

US Comments on India deal with Russia for defence

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News