Friday, April 26, 2024

ఆ సింహం నుంచి పరుగుల వీరుడు బోల్ట్ కూడా తప్పించుకోలేడు (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

 

గాంధీనగర్: గుజరాత్‌లోని మాధావ్‌పూర్ గ్రామంలోకి ఓ సింహం ప్రవేశించింది. అటవీలో నుంచి జనసంచారంలోకి రావడంతో గ్రామస్థులు భయాందోళనకు గరుయ్యారు. సింహం ఉన్న ఇంటి ముందు గ్రామస్థులు గుంపుగా ఉన్నారు. సింహం ఒక్కసారిగా బయటకు రావడంతో అక్కడ ఉన్న వారు చెల్లాచెదురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏడు సెకన్ల నిడివితో ఉన్న వీడియోను ఐఎఫ్‌ఎస్ సుశాంత్ నందా తన ట్విట్టర్ ఆకౌంట్‌లో పోస్టు చేశాడు. ఇప్పటి వరకు ఆ వీడియోను 6400 మంది వీక్షించగా 588 నెటిజన్లు లైక్ చేశారు. ఆ సింహం గంటకు 80 కిలో మీటర్ల వేగంతో పరుగులు తీసిందని, పరుగుల వీరుడు, జమైకా చిరుత ఉస్సేన్ బోల్ట్ కూడా సింహం నుంచి తప్పించుకోలేడని సుశాంత్ ట్వీట్ చేశాడు. ఉస్సేన్ బోల్ట్ గంటకు 38 కిలో మీటర్ల వేగంతో పరుగెత్తగలడు.

Imagine someone charging at you at 80kmp Even Usain Bolt can’t escape( Average speed-38kmp)from a charging lion. In such a situation, where will u find tolerance for each other other than India? Video from Madavpur village of Gujurat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News