Tuesday, April 30, 2024

ఉసెన్ బోల్ట్‌కు కరోనా

- Advertisement -
- Advertisement -

జమైకా: ప్రపంచ దిగ్గజ అథ్లెట్, జమైకా స్టార్ ఉసెన్ బోల్ట్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని జమైకా ఆరోగ్య శాఖ స్వయంగా ప్రకటించింది. ఇటీవల బోల్ట్ ఓ విందును ఏర్పాటు చేశాడు. జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ పార్టీలో చాలా మంది పాల్గొన్నారు. దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలిసింది. అయితే గేల్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అయితే పార్టీని నిర్వహించిన బోల్ట్‌కు మాత్రం కరోనా ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. దీంతో అతను హోం క్వారంటైన్‌లోకి వెళ్లి పోయాడు. ఇక పార్టీలో పాల్గొన్న చాలా మందికి కూడా కరోనా లక్షణాలు ఉన్నట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు జమైకా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక కరోనా విజృంభిస్తున్న సమయంలో బోల్ట్ వంటి దిగ్గజం నిర్లక్షంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 34 ఏళ్ల బోల్ట్ ఒలింపిక్స్‌లో ఏకంగా 8 స్వర్ణాలు సాధించి చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్న బోల్ట్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.

Usain Bolt tests Positive for Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News