Monday, May 6, 2024

మురికివాడల్లో వ్యాక్సిన్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

ఇంటింటా తిరిగి ఉచితంగా పంపిణీ చేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు
నగరంలో 4846 మురికివాడల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్
టీకా పూర్తియిన ఇంటికి స్టికర్ల వేస్తున్న వైద్య సిబ్బంది
వ్యాక్సిన్ పంపిణీపై తనిఖీలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ శర్మన్

నగరంలో కరోనా వైరస్ నియంత్రించడమే లక్షంగా ప్రభుత్వం ఇంటింటికి ఉ చితంగా కరోనా టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టింది. కాలనీ, బస్తీల్లో ప్రతి ఇంటికి వెళ్లి సెకండ్ డోసు వేసుకున్నవారు ఎంతమంది ఉన్నారు, ఇప్పటివరకు టీకాలు వేసుకొని వారు ఎంతమంది ఉన్నారు, సర్వే చేపట్టి మొదటి డోసు వేసుకుని రెండో డోసు తీసుకోని వారికి, మొదటి డోసు డోసు కూడా వేసుకోని వారిని గుర్తించి వారికి టీకాలు వేయనున్నారు. గ్రేటర్ నగరంలో వైద్యశాఖ, జీహెచ్‌ఎంసీ కలిసి 4846 కాలనీల్లో 5100 వైద్య సిబ్బందితో డ్రైవ్ నిర్వహిస్తూ ఈనెలాఖరులో వందశాతం వ్యాక్సిన్ పూర్తి చేస్తామని వెల్లడిస్తున్నారు.

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో కరోనాను పూర్తిగా అడ్డుకునేందుకు డిసెంబర్ 1వ తేదీవరకు విస్తృతంగా సర్వే చేసి అందరికి టీకా పంపిణీ చేసి థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొంటామని వైద్య సిబ్బంది చెబుతున్నారు. అదే విధంగా వ్యాక్సినేషన్ అందరికి అందుబాటులో ఉంచడానికి కాలనీలు, బస్తీల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. వ్యాక్సిన్ పట్ల కొందరు నిర్లక్షం చేస్తున్నారని, వారికి అవగాహన కల్పించి టీకా వేస్తామని పేర్కొంటున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేసి ఆశావర్కర్, అంగన్వాటీ వర్కర్ వీఆర్‌ఏ సభ్యులుగా చేసి, ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారి నియమించి ప్రతి రోజు వ్యాక్సిన్ వేగం జరిగేలా చేపడుతున్నట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. సిబ్బంది వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ పలు ప్రాం తాలను సందర్శించి టీకా పంపిణీపై ఆరా తీ స్తున్నారు. గ్రేటర్ మూ డు జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 1, 14, 93,410 మంది వ్యా క్సిన్ తీసుకోగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 47,94,882మందికి టీకా వేయగా, అందులో మొ దటి డోసు 30,89,620 మంది, సె కండ్ డోసు 17, 05,226మంది తీ సుకున్నారు. రంగారెడ్డిలో 34,17, 390 మంది తీసుకోగా, మొదటి డో సు 22, 49, 720 మంది, సెకండ్ డోసు 11, 69, 456మంది, మేడ్చల్ జిల్లాలో 32,86,996 మందికి వ్యాక్సిన్ పంపిణీ చే యగా, మొదటి డోసు 20, 85,893మంది, సెకండ్ డోసు 11. 98, 103మంది తీసుకున్నట్లు ఆయా జిల్లా వైద్యాధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభు త్వం విధించిన గడువులోగా సెకండ్ డోసు తీసుకోని వారిని కూడా గుర్తించి, వారికి కూడా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామంటున్నారు. డిసెంబర్ మొదటి వారంలో గ్రే టర్ పరిధిలో వందశాతం టీకా పంపిణీ పూర్తి చేసి థర్డ్‌వేవ్ వచ్చి తట్టుకునేలా చేస్తామంటున్నారు. నగర ప్ర జలు వైరస్ పట్ల నిర్లక్షం పెళ్లిళ్లు, వేడుకల పరిమిత సంఖ్యలో చేసుకోవాలని, గుంపులు చేరి అట్టహాసంగా నిర్వహిస్తే వైరస్ ఉనికి చాటుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News