Monday, April 29, 2024

నిజాం నిరంకుశంను ఎదురించిన తత్వవేత్త వరకవి సిద్దప్ప

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరకవి సిద్దప్ప తెలంగాణ తొలి కవుల్లో ప్రథముడు, నిజాం నిరంకుశ వ్యవస్థను నిరసించిన తత్వవేత్త అని బిసి కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాటం నరసింహ యాదవ్ పేర్కొన్నారు. ఆయుర్వేదాన్ని ఔపోసన పట్టిన ఘనుడు, భవిష్యత్తు క్రమాన్ని తెలిపిన అపర కాలజ్ఞాని, జ్యోతిష్య, వాస్తు శాస్త్రాలలో దిట్ట, సీస పద్యాలతో ఆకట్టుకున్న అచల తత్వవేత్త, గాంధీజీని కలిసి వారి ఆశయ సాధనకు కృషిసల్పిన స్వాతంత్ర సమరయోధుడు, కవితయోధుడని తెలిపారు. ఆదివారం అఖిల భారతీయ కుమ్మర ప్రజాపతి కుంభకార్ మహాసంఘ్, తెలుగు బాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో వరకవి సిద్దప్ప రాజయోగి 120వ జయంత్యుత్సవ కార్యక్రమం వెనుకబడిన తరగతుల కులాల సాధికారత సంస్థ హాల్ లో ఘనంగా నిర్వహించారు.

కుమ్మర సంఘం నాయకులు సిలివేరు శంకర్ ప్రజాపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వరకవి సిద్దప్పకు నివాళులర్పంచడంతో పాటు, కవి సమ్మేళనం నిర్వహించి, వారిని సన్మానించి ప్రశంశా పత్రాలు అందజేశారు. అనంతరం తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాళేశ్వరం శంకరం, బైస దేవదాసు, అవేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కటకం నర్సింగ్ రావు మాట్లాడుతూ – గోల్కొండ కవిగా, తెలంగాణ వేమనగా ప్రసిద్ధిగాంచిన వరకవి సిద్దప్ప కవిత్వం జనం నాలుకలపై విరాజిల్లుతోంది అన్నారు. అటువంటి మహాకవి సిద్దప్పను ప్రభుత్వం గుర్తించాలని, హైదరాబాద్, సిద్దిపేట జిల్లాలో ఆయన విగ్రహం, ఆయన పేరిట సాహితీ కేంద్రం, ఆయన సమాధి వద్ద స్మారక కళాపీఠం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కటుకూరి లింగస్వామి, దునుకు వేలాద్రి, నర్సింహులు, చీదెళ్ళ సీతాలక్ష్మి, సిద్దప్ప వరకవి కుమారుడు అనంతవరపు వీరేశలింగం, చంద్రశేఖర్ రావు, గురునాథం, డా.సి .నారాయణ, సుతారపు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News