Tuesday, March 19, 2024

మార్చి మూడో వారంలో “వీరఖడ్గం”

- Advertisement -
- Advertisement -

వివివి ప్రొడక్షన్స్ పతాకంపై ఎం ఏ చౌదరి దర్శకత్వంలో, కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం “వీరఖడ్గం`. మారుశెట్టి సునీల్ కుమార్ లైన్ ప్రొడ్యూస‌ర్‌. సృష్టి డాంగే హీరోయిన్‌. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని మార్చి మూడో వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ఈ రోజు ఫిలిం చాంబ‌ర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ…“ద‌ర్శ‌కుడు ఎమ్ ఏ చౌద‌రి ప్ర‌తిభావంతుడు. చాలా కాలంగా తెలుసు. పాట‌లు బావున్నాయి. ఈ సినిమా విజ‌య‌వంత‌మై ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

ద‌ర్శ‌కుడు ఎమ్ఏ చౌద‌రి మాట్లాడుతూ…“ చరిత్ర శిథలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి…పగ కూడా అంతే. ఒక మనిషిని నాశనం చెయ్యాలి అనుకుంటే ఎన్ని జన్మలైనా సరే దాన్ని సాధించే వరకు మనిషి జీవితం మసి అయినా, ఆ శవమే మృగమై వెంటాడుతుంది, వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ…. వీరఖడ్గం. గ్రాఫిక్స్ కి ప్రాధాన్య‌త ఉన్న చిత్ర‌మిది. నిర్మాత కోటేశ్వ‌ర‌రావు , లైన్ ప్రొడ్యూస‌ర్ సునీల్ కుమార్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. షాయ‌క్ ప‌ర్వేజ్ మంచి సంగీతాన్ని స‌మ‌కూర్చాడు. మార్చి మూడో వారంలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

లైన్ ప్రొడ్యూస‌ర్ మారుశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ…“నిర్మాతగా నేను గ‌తంలో `రెండో కృష్ణుడు` అనే సినిమా తీశాను. ఆ త‌ర్వాత ఎమ్ఏ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఇంద్రాణి, చిలిపికృష్ణుడు చిత్రాల‌కు ఫైనాన్సియ‌ర్ గా చేశాను. క‌థ న‌చ్చి `వీర‌ఖ‌డ్గం` చిత్రానికి లైన్ ప్రొడ్యూస‌ర్ గా చేశాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేక్ష‌కులు మాచిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా“ అన్నారు.

తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“సినిమా చూశాను. మంచి గ్రాఫిక్స్ తో చాలా గ్రాండ్ గా తీశారు. పాట‌లు కూడా బావున్నాయి. లొకేష‌న్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తీసుక‌రావాల‌న్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు షాయ‌క్ ప‌ర్వేజ్ మాట్లాడుతూ…“ ఇందులో నాలుగు పాట‌లున్నాయి. సునీత , లలిత సాగ‌రి, సాహితి, రామ‌కృష్ణ పాట‌లు పాడారు. ద‌ర్శ‌కుడు చౌద‌రి గారు నాతో క్వాలిటీ వ‌ర్క్ చేయించుకున్నారు. 300 ఏళ్ల క్రితం పార్వ‌తిపురంలో జ‌రిగిన ఓ య‌థార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మ్యూజిక్ కి స్కోపున్న సినిమా “ అన్నారు.

బ్రహ్మానందం, సత్యప్రకాష్ , ఆనంద్ రాజ్, మదన్, తపస్వి, అపూర్వ, పృద్విరాజ్, టార్జన్, ధనరాజ్, తాగుబోతు రమేష్, చలపతి రావు తదితరులు నటించిన ఈ చిత్రానికి మాట‌లుః ఘ‌టికాచ‌లం; సంగీతంః షాయ‌క్ ప‌ర్వేజ్‌; పీఆర్ ఓః ర‌మేష్ చందు; ఫైట్స్ః నందు, దేవరాజ్ మాస్టర్, లైన్ ప్రొడ్యూస‌ర్ః మారుశెట్టి సునీల్ కుమార్‌; ప్రొడ్యూసర్ :K. కోటేశ్వరరావు, దర్శకత్వం. ఎం ఏ చౌదరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News