Saturday, April 27, 2024

కరోనా లాక్‌డౌన్ ఎఫెక్ట్.. ఎర్రగడ్డ మార్కెట్లో కూరగాయలు లూటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా(కోవిడ్-19) లాక్‌డౌన్ ఎఫెక్ట్ నేపథ్యంలో కూరగాయలు ధరలు పెంచి అమ్ముతున్న క్రమంలో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, మార్కెట్లో కూరగాయలను వినియోగదారులు లూటీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్‌లో చోటు చేసుకుంది. వినియోగదారులు కూరగాయలు కొనేందుకు మార్కెట్‌క వెళ్లగా అక్కడ  వ్యాపారులు ఎక్కువ రేటుకు కూరగాయలు అమ్ముతున్నారు. తాము చెప్పిన రేట్లకే కొంటే కొనండి.. లేకపోతే మానేయండి అంటూ కొన్ని చోట్ల వ్యాపారులు వినియోగదారులకు దురుసుగా సమాధానం ఇచ్చారు. దీంతో వినియోగదారులు ఆందోళనకు దిగారు. వినియోగదారుల ఆందోళనతో కొందరు వ్యాపారులు తమ దుకాణాలు మూసుకుని ఇళ్లకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఓ షాప్‌పై వినియోగదారులు దాడి చేసి కూరగాయలు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు.

Vegetable Price hike at Erragadda Vegetable Market

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News