Friday, May 3, 2024

‘మాస్ట్రో’ నుంచి ‘వెన్నెల్లో ఆడిపిల్ల’..

- Advertisement -
- Advertisement -

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలవుతున్న ఈ సినిమా నితిన్ ల్యాండ్ మార్క్‌గా నటిస్తోన్న 30వ చిత్రం కావడం విశేషం. కోవిడ్ పరిస్థితుల ప్రభావం కారణంగా నితిన్ తన ‘మాస్ట్రో’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలియజేశాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ‘వెన్నెల్లో ఆడిపిల్ల…’ అనే సాంగ్ ప్రోమోను విడుదల చేసిన నిర్మాతలు ఇప్పుడు పూర్తి సాంగ్‌ను విడుదల చేశారు. ఈ బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్‌లో నితిన్, నభా నటేష్ నటించారు. ఈ పాటను స్వీకర్ అగస్తీ పాడారు.

‘Vennello Adapilla’ song released from ‘Maestro’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News