Friday, May 3, 2024

కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Vijayawada Kanaka Durga Flyover inaugurated

అమరావతి: విజయవాడ కనకదుర్గగుడి ఫ్లైఓవర్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి ఎపి సిఎం జగన్‌ ప్రారంభించారు. వర్చువల్‌ కార్యక్రమం ద్వారా ఈ ప్రారంభోత్సవం కొనసాగింది. క్యాంప్ ఆపీసు నుంచి జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2.6 కి.మీ పోడువున్న దుర్గగుడి ఫ్లైఓవర్ ను, 900 పని దినాల్లో రూ. 501కోట్లతో నిర్మించారు. భవానీపురం నుంచి వారధి వరకు ప్లైఓవర్ నిర్మించారు. రూ.15.592 కోట్ల వ్యయంతో మరో 61 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ… ప్రధాని మోడీ హయంలో జాతీయ రహదారుల రూపరేఖలే మారిపోయాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పై కేంద్రమంత్రి గడ్కరీ ఎంతో చొరవ చూపారని పేర్కొన్నారు. ఎపి పరిధిలో రోడ్ల అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోందని చెప్పారు. కేంద్రం సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫ్లైఓవర్ విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని సిఎం జగన్ స్పష్టం చేశారు.

Vijayawada Kanaka Durga Flyover inaugurated

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News