Sunday, April 28, 2024

కోహ్లి ఊహించి ఉండడు?

- Advertisement -
- Advertisement -

కోలుకోలేని షాక్ ఇచ్చిన బిసిసిఐ!

Cricket fans slams Kohli over India defeat by NZ

ముంబై: టీమిండియాలో ఎదురులేని శక్తిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లి కి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఊహించని షాక్ ఇచ్చింది. కోహ్లిని కేవలం టెస్టు కెప్టెన్సీకి మాత్రమే పరిమితం చేసి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు రోహిత్ శర్మను సారథిగా నియమించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం వరకు భారత క్రికెట్ లో కోహ్లి చెప్పిందే వేదం. అతన్ని కా దని బిసిసిఐ ఏ నిర్ణయం తీసుకునేది కాదు. అయితే ట్వంటీ20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తాను టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు. ఇది కోహ్లి అభిమానులతో పాటు అందరినీ షాక్‌కు గురి చేసింది. చెప్పినట్టే వరల్డ్‌కప్ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించారు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లిని కాదని రోహిత్ శర్మకు బిసిసిఐ సారథ్య బాధ్యతలు అప్పగించడం పెను ప్రకంపనలు సృష్టించింది.

అంతేగాక టెస్టుల్లోనూ రోహిత్ శర్మను వైస్ కెప్టెన్‌గా నియమించి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కో హ్లిని కేవలం టెస్టులకు మాత్రమే కెప్టెన్‌గా ఉంచింది. రానున్న రోజుల్లో కోహ్లిని టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పించినా ఆశ్చ ర్యం లేదు. వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు బిసిసిఐకి కోహ్లి ఏదో విషయంలో అభిప్రాయ బేధాలు తలెత్తినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. దానికి తగినట్టే కోహ్లి కూడా టి20 కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. అయితే ఆ అభిప్రాయ బేధాలు మరింత ముదరడంతో కోహ్లి వన్డే కెప్టెన్సీకి సయితం ఎసరు తెచ్చింది. ఒకప్పుడూ కోహ్లి ఏదీ చెబితే దానికి బిసిసిఐ అంగీకరించేది. అయితే కొంత కాలంగా బిసిసిఐ త న వైఖరీని మార్చుకుంది. జట్టు ఎంపికలో కోహ్లి అనుసరించే విధానాలపై బిసిసిఐ పెద్ద అసంతృప్తి ఉన్నట్టు తెలిసింది. సీనియర్లపై కోహి వైఖరీని బిసిసిఐ పెద్దలు జీర్ణించుకోలేక పోయారు. అందుకే అతనికి బ్రేక్‌లు వేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నట్టు మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News