Friday, April 26, 2024

అగ్రస్థానంలోనే విరాట్ కోహ్లి

- Advertisement -
- Advertisement -

Virat Kohli

దుబాయి: అంతర్జాతీయ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పీడ్‌స్టర్ జస్‌ప్రిత్ బుమ్రా రెండో ర్యాంక్‌కు పడి పోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టక పోవడంతో బుమ్రా తన అగ్రస్థానాన్ని చేజార్చుకున్నాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ టాప్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. బ్యాటింగ్ విభాగాంలో కోహ్లి అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. అయితే కివీస్ సిరీస్‌లో అంతంత మాత్రంగానే రాణించడంతో భారీగా రేటింగ్ పాయింట్లను కోల్పోయాడు.

ప్రస్తుతం కోహ్లి 869 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. భారత్‌కే చెందిన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కివీస్ సిరీస్‌లో దూరంగా ఉన్నా రోహిత్ తన ర్యాంక్‌ను కాపాడు కోవడంలో సఫలమయ్యాడు. పాకిస్థాన్ సంచలనం బాబర్ ఆజమ్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. కాగా, భారత్‌పై మెరుపులు మెరిపించిన కివీస్ సీనియర్ ఆటగాడు రాస్ టైలర్ తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకాడు. మరోవైపు దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ ఐదో ర్యాంక్‌కు పడి పోయాడు.

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), క్వింటాన్ డికాక్ (సౌతాఫ్రికా), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), జోరూట్ (ఇంగ్లండ్), అరోన్ ఫించ్‌లు తర్వాతి ర్యాంక్‌లలో నిలిచి టాప్ టెన్ చోటు సంపాదించారు. ఇక, బౌలింగ్‌లో బుమ్రా 719 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు పడి పోయాడు. బౌల్ట్ (కివీస్) 727 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ముజీబుర్ రహ్మాన్ (అఫ్గాన్), కగిసో రబడా (సౌతాఫ్రికా), కమిన్స్ (ఆస్ట్రేలియా)లు తర్వాతి ర్యాంక్‌లలో నిలిచారు.

 

Virat Kohli Continues at No 1 in ODIs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News