Saturday, April 27, 2024

టిఆర్‌ఎస్‌తో కలిసి సాగుతాం

- Advertisement -
- Advertisement -

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపిని ఓడించగలిగే సత్తా టిఆర్‌ఎస్‌కే ఉందని, అందుకే ఆ పార్టీకి మద్దతు నివ్వాలని సిపిఐ రాష్ట్ర వి స్తృత స్థాయి కార్యవర్గ సమావే శం నిర్ణయించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్యం, రా జ్యాంగాన్ని ప్రమాదంలో పడేస్తున్న బిజెపిని దేశ వ్యాప్తంగా ఓడించేందుకు కేవలం మునుగోడు ఉప ఎన్నికకే పరిమితం కాకుండా భవిష్యత్తులో కూడా టిఆర్‌ఎస్, సిపిఐ, సిపిఎం, వా మపక్ష శక్తులతో కలిసి ప్రయాణం చేయనున్నట్లు తెలిపారు. సిపిఐ కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అధ్యక్షతన మగ్దూం భవన్ రెండు రోజుల పాటు జరిగిన కార్యవర్గ సమావేశాలలో సిపిఐ మూడవ రాష్ట్ర మహాసభలు, మునుగోడు ఉప ఎన్నికపై చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, బాగం హేమంతరావు, ఎన్.బాల మల్లేశ్ కలిసి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి సమావేశ వివరాలను వివరించారు.

సెప్టెంబర్ 4 నుండి 7వ తేదీలో శంషాబాద్ జరిగే సిపిఐ రాష్ట్ర మూడవ మహాసభకు సంబంధించిన ముసాయిదా రాజకీయ, నిర్మాణ తీర్మానాలను కార్యవర్గ సమావేశంలో ప్రతిపాదించనట్లు తెలిపారు. సిపిఐ మద్దతుతో కాంగ్రెస్ నుండి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ ఎంఎల్ ఎ పదవికి రాజీనామా చేయడంతో అనివార్యమైన మునుగోడు ఉప ఎన్నికపై చర్చించామన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన బిజెపిలో చేరుతున్నారని, బిజెపి బలవంతంగా ఉప ఎన్నికను ప్రజలపై రుద్దుతోందన్నారు. ఇలాంటి తరుణంలో బాధ్యతాయుతమైన పార్టీగా ఉప ఎన్నికపై చర్చించామన్నారు. ఈ ఉప ఎన్నికను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడుకు వస్తున్నారని, తెలంగాణలో ప్రగతిశీల శక్తుల ముందు నిలబడలేమనేది మతోన్మాద పార్టీకి అర్థం కావాలన్నారు. ఉప ఎన్నిక గురించి మునుగోడు నియోజకవర్గ పార్టీ కమిటీలతో చర్చించామని, అందరూ కూడా ఏక్రగీవంగా బిజెపిని ఓడించేందుకు టిఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలనే సూచించారని తెలిపారు.

గతంలో మునుగోడు నియోజకవర్గం నుండి పొత్తులతో సిపిఐ ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించిందని గుర్తు చేశారు. అన్నింటిని పరిగణలోకి తీసుకొని బిజెపిని ఓడించేందుకు ఈ ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్‌కు మద్దతునివ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందని వివరించారు. మునుగోడులో బిజెపిని ఓడించే సత్తా టిఆర్‌ఎస్‌కే ఉన్నదన్నారు. మతోన్మాద, నియంతృత్వ, ఫాసిస్టు బిజెపిని ఓడించడమే లక్షంగా జాతీయ పార్టీ తీర్మానం ఉన్నదని, దేశంలో లౌకిక, వామపక్ష, ప్రజతాతంత్ర శక్తులతో వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నదని, ఈ నిరంతర ప్రకియలో తెలంగాణలో కూడా ఏర్పాటుకు ఆలోచన చేశామని తెలిపారు. కేసీఆర్ సైతం దేశంలో బిజెపిని ఓడిందేందుకు ప్రజాతంత్ర, లౌకిక శక్తులను కూడగట్టేందుకు కార్యాచరణ తీసుకుంటానని చెప్పారని గుర్తు చేశారు. విభజన హామీలలో ఒక్కటి కూడా ఎనిమిదేళ్ళలో అమలు చేయని బిజెపికి మునుగోడులో ఓటు అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ నిర్మాణ పరిస్థితి, పార్టీ గురించి అందరికీ తెలుసునని, 2018లో మహాకూటమి పేరుతో కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరించిందో, సిపిఐకి ఇచ్చిన మూడు స్థానాలలో ఎలా వ్యవహరించారో తెలిసిందేనని గుర్తు చేశారు. కనీసం ఫలితాలపై సమీక్ష నిర్వహించాలని ఉత్తమ్ లేఖ రాసినా స్పందన లేదన్నారు. టిఆర్‌ఎస్‌కు మద్దతునిచ్చినంత మాత్రాన పోరాటాలు మాత్రం ఆగబోవన్నారు.

మునుగోడులో అసహజ ఎన్నికలు ః నారాయణ

మునుగోడులో సహజంగా వచ్చిన ఎన్నికలు కావని, మోడీ ప్రోద్భలంతో వచ్చిన అసహజ ఎన్నికలు అని నారాయణ తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చాక తొమ్మిది రాష్ట్రాలలో వారికి వ్యతిరేకంగా వచ్చిన పార్టీల ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూల దోసిందన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైళ్ళకు పంపుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉప ఎన్నికలో బిజెపిని ఓడిస్తే ఆ సందేశం దేశమంతటికీ పోతుందన్నారు. బిజెపికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కాంగ్రెస్ పార్టీ సహజ భాగస్వామి అయినప్పటికీ, ఇక్కడ ఆ పార్టీ పరిస్థితి ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కిపోతున్నట్లు ఉన్నదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News