Monday, April 29, 2024

దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తాం : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

27న అమిత్ షా, అగ్ర నేతలలో రాష్ట్రంలో ప్రచారం

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత శాసనసభ్యులు, ఎంపిలు, మున్సిపల్ చైర్మన్లు తదితరులకు మొదటి జాబితాలో చోటు దక్కిందని, దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న రాష్ట్రంలో జరిగే బహిరంగ సభకు హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారని తెలిపారు. ఈ నెల 27 నుంచి 31 వరకు జరిగే పలు బహిరంగ సభల్లో యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు బిజెపి అగ్రనేతలు పాల్గొనున్నారని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్టాటంగా ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీబ్యారేజీకి సంబంధించిన పిల్లర్లు కుంగాయి. ఇంజనీర్లు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్తే.. వాళ్లను పరిశీలించనీయకుండా అడ్డుకుంటున్నారు. లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్ పతనమవుతుంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. కుంగిన బ్రిడ్జిని ఎమ్మెల్యే రాజేందర్ పరిశీలించనున్నారని వెల్లడించారు. రాష్ట్ర సంపదను కొల్లగొట్టిన ఈ ప్రాజెక్టు.. ప్రారంభించిన మూడేండ్లలోనే కొంత భాగం కుంగిపోయిందని విమర్శించారు. గతంలో గోదావరిలో వరదలు వచ్చినప్పుడు పంప్‌హౌజ్‌లు మునిగిపోయి.. మోటార్లు మునిగి వేల కోట్ల నష్టం వచ్చింది ఇప్పుడు ప్రాజెక్టు కుంగిపోతున్నది. లోపాలు బయటపడుతున్నాయి. ఐదేండ్లలో 150 టిఎంసిల నీళ్లు ఎత్తిపోసి.. వాటిని మళ్లీ కిందకు వదిలారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని 5 సభల్లో, అమిత్ షా 3 సభల్లో పాల్గొన్నారు. త్వరలోనే మరోసారి అమిత్ షా, సిఎం యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. దసరా తర్వాత బిజెపి ఎన్నికల కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో ప్రాథమికంగా కలిసి, మాట్లాడం పొత్తు అంశం పార్టీ నిర్ణయం తీసుకుంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో ఎంపి అర్వింద్, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News