Saturday, April 27, 2024

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశం పరిశీలిస్తాం: సిఎం

- Advertisement -
- Advertisement -

డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు సిఎం రేవంత్ హామీ
సచివాలయంలో సీఎంను కలిసిన డిజేహెచ్‌ఎస్ ప్రతినిధి బృందం

మన తెలంగాణ / హైదరాబాద్:  హైదరాబాద్‌లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (డిజెహెచ్‌ఎస్) అధ్యక్షులు బొల్లోజు రవి, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండా రామకృష్ణ,, సభ్యులు క్రాంతి తదితరులు సచివాలయంలో సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఈ విషయంపై సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనూ చర్చించాలని డిజెహెచ్‌ఎస్ ప్రతినిధులకు సూచించారు.

అనంతరం తాము జర్నలిస్టులకు ఎలా ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా డిజెహెచ్‌ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన ఈ పదేళ్ల కాలంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశం ఒక కలగానే మిగిలిపోయిందని సిఎంకు ఇచ్చిన వినతిపత్రంలో ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇళ్ల స్థలాల అంశాన్ని చేర్చాలని ఎన్నికల సమయంలో అప్పటి టిపిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డిని కలిసి విన్నవించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. డిజెహెచ్‌ఎస్ విన్నపాన్ని మన్నించి మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచారని, అందుకు సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం అత్యంత సంతోషకరమని బొల్లోజు రవి అన్నారు. జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసే విశాల హృదయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఉందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. రేవంత్‌ రెడ్డి ద్వారా జర్నలిస్టుల సొంతింటి కల సాకారమవుతుందన్న అచంచల విశ్వాసం ఉందని వినతిపత్రంలో వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేవలం తెలంగాణ ప్రాంత జర్నలిస్టులతో ఏర్పాటైన ఏకైక సొసైటీ ‘డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (డిజెహెచ్‌ఎస్)’ అని సీఎంకు విన్నవించారు. ఈ సొసైటీలో ఐదు వందల మందికి పైబడి సభ్యులున్నారన్నారు. వీరంతా వివిధ పత్రికలు, న్యూస్ ఛానెళ్లలో జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్టాఫ్ రిపోర్టర్, సబ్ ఎడిటర్ నుంచి బ్యూరో చీఫ్‌లు, న్యూస్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్ ఆపై స్థాయిలో హైదరాబాద్ కేంద్రంగా దశాబ్దాలుగా పనిచేస్తున్నారని సీఎంకు ఇచ్చిన వినతిపత్రంలో వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News