Friday, May 3, 2024

ప్రతీ ఇంట్లో సంక్షేమం.. ప్రతీ మోమున సంతోషం

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: ప్రతీ ఇంట్లో సంక్షేమం.. ప్రతీ మోమున సంతోషం సిఎం కెసిఆర్ లక్షమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గవిచర్ల రోడ్డులోని జీఎం గార్డెన్స్‌లో తెలంగాణ సంక్షేమ దినోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు వరకు వెళ్లి తెలంగాణ తెచ్చారన్నారు. కెసిఆర్ యావత్తు తెలంగాణను ఒక్కతాటిపై తీసుకొచ్చి సకల జనులు సమ్మెలో అన్ని రంగాల ప్రజలు పాల్గొని తెలంగాణను సాధించుకున్నాం.

గొర్రెల పంపిణీ, కల్యాణలక్ష్మి, షాది ముబారక్ లాంటి మరెన్నో పథకాలు నాటి పాలకులకు ప్రజలకు అందించడం చేతకాలేదు. కనీసం ఆలోచన కూడా రాలేదు. తెలంగాణ సర్కారు కెసిఆర్ అన్ని వర్గాలకు వారికి అండగా ఉంటున్నారు. చేతి వృత్తులు చేసుకునే 16 కులాల వారికి రూ. లక్ష అందించబోతుంది. నియోజకవర్గంలో రెండు వేల ఇళ్లు నిర్మించాం. 39 వేల మందికి పింఛన్లు అందిస్తున్నాం. రూ. 3800 కోట్లతో నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నాం. హాస్పిటల్, బస్‌స్టేషన్, కలెక్టరేట్ తెచ్చుకున్నాం. వాడ వాడన సీసీ రోడ్లు వేసుకున్నామన్నారు. 20వ తేదీలోపు కుల వృత్తులకు అందిస్తున్న ప్రోత్సాహకం కోసం అందరూ అప్లై చేసుకోవాలన్నారు.

నియోజకవర్గానికి చెందిన 95 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ చెక్కులు, 82 మందికి మైనార్టీ లోన్లు, 70 మందికి సిఎం సహాయనిధి, 24 యూనిట్ల గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, స్థానిక కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్, ఆర్డీవో మహేందర్, నియోజకవర్గానికి చెందిన అన్ని డివిజన్ల కార్పోరేట్లు, మాజీ కార్పోరేటర్లు, ఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సంబంధిత శాఖాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, ఆర్పీలు, అంగన్‌వాడీలు, ప్రభుత్వ మద్దతుదారులు, సంక్షేమ లబ్ధ్దిదారులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News