Tuesday, April 30, 2024

మోడీ గ్యారంటీ అంటే ఏమిటి? : నిలదీసిన విపక్షాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : “మోడీ కి గ్యారంటీ” అనే శీర్షికతో ఆదివారం విడుదలైన బీజేపీ మేనిఫెస్టోను విపక్ష నేతలు అనేక మంది తోసిపుచ్చారు. ప్రధాని గ్యారంటీ అంటే ఏమిటి ? అని ప్రశ్నించారు. దేశాన్ని ‘అధోగతి’ చేయడమే తప్ప మరేమీ లేదని కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఎద్దేవా చేశారు. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ ఉమ్మడిగా మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టడం, ఫాసిస్ట్ నియంతృత్వం సాగించడం తప్ప మరేమీ లేదు. ప్రజాస్వామ్యం, పార్లమెంట్, రాజ్యాంగం అంటే వారికి గౌరవం లేదని రాజా ధ్వజమెత్తారు.

ఏం మేనిఫెస్టో ? మోడీ గ్యారంటీ అంటే జీరో వారంటీ అని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రియన్ తన ఎక్స్ పోస్ట్ ద్వారా విమర్శించారు. ఈ సందర్భంగా తాను రాసిన వ్యాసాన్ని ఉదహరించారు. 25 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, నల్లడబ్బు వెనక్కు తెస్తామని, తదితర హామీలు ఏమయ్యాయి? అని ఆ వ్యాసంలో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసిన అంశాలను పేర్కొ న్నారు. రాష్ట్రీయ జనతా దళ్ నేత తేజస్వియాదవ్ ఉద్యోగాల కల్పన వంటి హామీలపై బీజేపీని ప్రశ్నించారు.

బీజేపీ మేనిఫెస్టోలో ఉద్యోగాల కల్పన కాని, ఉపాధి కానీ అలాంటి మాట లేదు. అలాగే ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామని, లేదా నిర్మూలిస్తామని, నిరుద్యోగాన్ని , పేదరికాన్ని నిర్మూలిస్తామన్న ప్రసక్తే లేదని యాదవ్ విమర్శించారు. 60 శాతం వరకు ఉన్న యువతకు, 80 శాతం మంది రైతులకు , 6లక్షల 40 వేలకు మించి ఉన్న గ్రామాలకు ఏం ప్రయోజనమో మేనిఫెస్టోలో ఎక్కడ చెప్పలేదని ఆయన విమర్శించారు. వెనుకబడిన , పేద వర్గాల అభివృద్ధి గురించి లేదు. గరిష్ఠ సంఖ్యలో లోక్‌సభ ఎంపీలు వచ్చే రాష్ట్రాల అభివృద్ధి గురించి ఏం చెప్పలేదు. ఉద్యోగాలు, ఉపాధి, యువత, రైతులు, సైనికులు, గ్రామాలు గురించి మ్యేనిఫెస్టోలో పూర్తిగా విస్మరించాని తేజస్వియాదవ్ ధ్వజమెత్తారు.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో సతమతమవుతున్న అనిశ్చితి ప్రపంచంలో పటిష్టమైన, సుస్థిరమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మోడీ అభ్యర్థిస్తూన్నట్టు ఆదివారం బీజేపీ మేనిఫెస్ట్ విడుదల చేసిందని, అభివృద్ధి , సంక్షేమం గురించి లేకుండా ఎన్‌ఆర్‌సి వంటి వివాదాస్పద అంశాలతో ఈ మేనిఫెస్టో విడుదలైందని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న వన్ నేషన్, వన్ ఎలెక్షన్ మోడల్, యూనిఫారం సివిల్ కోడ్ మళ్లీ ఇప్పటి మేనిఫెస్టోలో ప్రస్తావించారని , వీటి అమలుకు ఇప్పటికే గట్టి చర్యలు బీజేపీ ప్రభుత్వం తీసుకుంటోందని విమర్శించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News