Friday, April 26, 2024

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ వద్దు

- Advertisement -
- Advertisement -

Whatsapp new privacy policy 2021

ఉపసంహరించుకోవాలన్న ప్రభుత్వం
14 ప్రశ్నలకు సమాధానమివ్వాలని కోరిన కేంద్రం

ముంబై : సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ(గోప్యతా విధానం) ఉపసంహరిం చుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. వినియోగదారుల హాని కల్గించే మార్పులను వాట్సాప్ కొత్త గోప్యతా విధానంలో ప్రవేశ పెట్టింది. ఈ కొత్త విధానం గురించి భారత్ పలు ప్రశ్నలు సంధించింది. ఏకపక్ష మార్పు ఆమోదయోగ్యం కాదని ప్రభు త్వం పేర్కొంది. కొత్త గోప్యతా విధానానికి సంబంధించి ఎలక్ట్రా నిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్ సిఇఒ విల్ క్యాత్‌కార్ట్‌కు లేఖ రాసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వాట్సాప్‌కు భారతదేశంలో అతిపెద్ద యూజర్ బేస్ ఉంది. వాట్సాప్ సేవా నిబంధనలు, గోప్యతా విధానంలో మార్పు భార తీయ పౌరుల ఎంపిక, స్వయంప్రతిపత్తిపై తీవ్రమైన ఆందోళన లను రేకెత్తిస్తోంది. వాట్సాప్ ప్రతిపాదిత మార్పులను వెనక్కి తీసుకోవాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో సమాచార గోప్యత, ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, డేటా భద్రత తమ విధానాన్ని పునఃసమీక్షించాలి. భారతీయులను గౌరవించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వాట్సాప్ సేవా నిబంధనలు, విధా నంలో ఏదైనా ఏకపక్ష మార్పు న్యాయమైనది కాదు, అంగీకరిం చబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

వాట్సాప్ కొత్త విధానం ఏమిటి?

కంటెంట్‌ను అప్‌లోడ్ చేసే, సమర్పించే, నిల్వచేసే, పంపే లేదా స్వీకరించే వాట్సాప్ వినియోగదారులు, కంపెనీ దీన్ని ఎక్కడై నా ఉపయోగించవచ్చు. కంపెనీ ఆ డేటాను కూడా పంచుకోవ చ్చు. ఈ విధానం 2021 ఫిబ్రవరి 20 నుండి అమల్లోకి వస్తుం ది. అయితే వివాదం ముదరడంతో గడువును మే 15కి పొడి గించారు. వినియోగదారు ఈ విధానాన్ని అంగీకరించక పోయి నట్లతే, వారి ఖాతాను ఉపయోగించుకోలేరు. అయితే సంస్థ తరువాత దీనిని ఆప్షనల్ అని పిలిచింది. వాట్సాప్ కొత్త విధాన వివాదాల మధ్య సమాచార సాంకేతిక పరిజ్ఞానంపై పార్లమెం టరీ స్టాండింగ్ కమిటీ జనవరి 21న ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను పిలిచింది. ఈ రెండు సంస్థల అధికారులతో సోషల్ మీడియా దుర్వినియోగం గురించి కమిటీ చర్చించనుంది. సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అధికారులను కూడా ఈ కమిటీ పిలిచింది. ఈ సమావేశంలో వాట్సాప్ కొత్త గోప్యతా విధానం కూడా సమీక్షిస్తారు.

ముదిరిన వివాదం

వాట్సాప్ ఇటీవల కొత్త గోప్యతా విధానంపై వివాదం మొద లైంది. వినియోగదారుల గోప్యతకు అంతరాయం కలిగిస్తుంద ని ప్రజలు భావిస్తున్నారు. వాట్సాప్ తర్వాత పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఉన్న టెలిగ్రామ్, సిగ్నల్‌కు కనెక్ట్ అయ్యే అవకాశముందని భావిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News