- Advertisement -
హైదరాబాద్: మంత్రి కెటిఆర్ సిఎం అయితే తప్పేముందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని అన్నారు. తగుసమయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బుధవారం తలసాని మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై కామెంట్లు చేసే బిజెపి నాయకులకు బుద్ధి జ్ఞానం లేదన్నారు. అవగాహన లేకుండా కాళేశ్వరంపై మాట్లాడుతున్నారని విరుచుకపడ్డారు. దమ్ముంటే బిజెపి నేతలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మాట్లాడాలని తలసాని సవాలు విసిరారు. హైదరాబాద్ వరద బాధితులకు ఇచ్చిన రూ. 25 వేల హామీ ఏమైందని ప్రశ్నించారు. గతంలో నీళ్లులేక తెలంగాణలో రైతులు ఇబ్బంది పడేవాళ్లని, కెసిఆర్ పాలనలో తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. రైతులు సంతోషంగా రెండు పంటలు వేసుకుంటున్నారని, కాళేశ్వరంపై మాట్లాడే నైతిక హక్కు బిజెపికి లేదన్నారు.
- Advertisement -